కేంద్ర సమాచార శాఖ తెలంగాణ‌ రీజియన్ అదనపు డైరెక్టర్ జనరల్‌గా వెంకటేశ్వర్..

కే౦ద్ర సమాచార శాఖ తెలంగాణ‌ రీజియన్ అదనపు డైరెక్టర్ జనరల్‌గా ఎస్.వెంకటేశ్వర్ ఈ రోజు బాధ్యతలు చేపట్టారు. 1989 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్‌గా విధులు నిర్వహించారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 17, 2019, 7:47 PM IST
కేంద్ర సమాచార శాఖ తెలంగాణ‌ రీజియన్ అదనపు డైరెక్టర్ జనరల్‌గా వెంకటేశ్వర్..
కేంద్ర సమాచార శాఖ తెలంగాణ రీజియన్ అదనపు డైరెక్టర్ జనరల్‌గా వెంకటేశ్వర్
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 17, 2019, 7:47 PM IST
కేంద్ర సమాచార శాఖ తెలంగాణ‌ రీజియన్ అదనపు డైరెక్టర్ జనరల్‌గా ఎస్.వెంకటేశ్వర్ ఈ రోజు బాధ్యతలు చేపట్టారు. 1989 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. ఇప్పుడు డిప్యూటేషన్ అనంతరం బదిలీపై హైదరాబాద్ వచ్చారు. ఈయన రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్ ఫర్ ఇండియా హైదరాబాద్ కార్యాలయ అదనపు ప్రెస్ రిజిస్ట్రార్‌గానూ వ్యవహరిస్తారు. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలో నూతనంగా ఏర్పాటు చేసిన రీజినల్ అవుట్ రీచ్ బ్యూరోకు అధిపతిగా కూడా ఉంటారు. వెంకటేశ్వర్ గత౦లో సమాచార ప్రసార మ౦త్రిత్వ శాఖలోని పలు విభాగాలలో కీలక బాధ్యతలు నిర్వర్తి౦చారు.

తన 30 స౦వత్సరాల పదవీకాలంలో పత్రిక సమాచార కార్యాలయ౦, బెంగళూరు అదనపు డైరెక్టర్ జనరల్‌గా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్‌గా, ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్‌లో డైరెక్టర్‌గా, పత్రికా సమాచార కార్యాలయం, భువనేశ్వర్ డైరెక్టర్‌గా వివిధ హోదాల్లో ఈయన పనిచేశారు.

First published: September 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...