హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

BREAKING: భారత్ కు నూతన అటార్నీ జనరల్‌గా సీనియర్ న్యాయవాది ఆర్ వెంకటరమణి నియామకం..

BREAKING: భారత్ కు నూతన అటార్నీ జనరల్‌గా సీనియర్ న్యాయవాది ఆర్ వెంకటరమణి నియామకం..

సీనియర్ న్యాయవాది ఆర్ వెంకటరమణి (ఫైల్)

సీనియర్ న్యాయవాది ఆర్ వెంకటరమణి (ఫైల్)

Delhi: భారతదేశానికి కొత్త అటార్నీ జనరల్‌గా సీనియర్ న్యాయవాది ఆర్ వెంకటరమణిని నియమించారు. 

  • News18 Telugu
  • Last Updated :
  • Delhi, India

భారతదేశానికి కొత్త అటార్నీ జనరల్‌గా సీనియర్ న్యాయవాది ఆర్ వెంకటరమణిని (R Venkataramani)  భారత ప్రభుత్వం నియమించారు. సీనియర్ న్యాయవాది అయిన ఆర్ వెంకట రమణి.. మూడేళ్ల కాలానికి గాను అటార్నీ జనరల్ గా నియమితులయ్యారు.  ఆయన తన పదవీలో చేరిన కాలంనుంచి మూడేళ్ల పాటు  ఈపదవీలో ఉంటారు. కాగా, సెప్టెంబర్ 25న ముకుల్ రోహత్గీ ఆఫర్‌ను తిరస్కరించిన తర్వాత (New Attorney General for India) ఈ నియామకం జరిగింది.

4 దశాబ్దాలకు పైగా వెంకటరమణియన్  లాయర్ గా (Senior Advocate)  చేశారు. గతంలో లా కమిషన్ ఆఫ్ ఇండియా సభ్యునిగా కూడా పనిచేశారు. 1979లో దివంగత రాజ్యాంగ నిపుణుడు పిపి రావు ఛాంబర్‌లో చేరారు.  1997లో ఎస్సీ సీనియర్ న్యాయవాదిగా నియమించబడ్డారు. ఆ తర్వాత.. 2004 నుండి 2010 వరకు SC, HCలలో వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలకు ప్రత్యేక సీనియర్ న్యాయవాదిగా వెంకటరమణి పనిచేశారు.  కోర్టు ఉద్యోగుల సర్వీస్ షరతులకు సంబంధించిన విషయాలలో SC న్యాయవాదిగా హాజరయ్యారు.  ఆమ్రపాలి కేసులో కోర్టు రిసీవర్‌గా పనిచేశారు.  ఇటీవల ఎస్సీలో హిజాబ్ రో కేసులో కూడా హాజరయ్యారు.

భారతదేశ ప్రస్తుత అటార్నీ జనరల్, 91 ఏళ్ల కేకే వేణుగోపాల్ పదవీకాలం సెప్టెంబర్ 30తో ముగియనుంది. ముకుల్ రోహత్గీ జూన్ 2014 నుండి జూన్ 2017 వరకు ఏజీగా ఉన్నారు. అతని తర్వాత వేణుగోపాల్ జూలై 2017లో ఆ పదవిలో నియమితులయ్యారు.

ఇదిలా ఉండగా ఈరోజే కేంద్రం సీడీఎస్ ను కూడా నియమించింది.

ఆర్మీ , నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ అనే మూడు సేవలను ఏకీకృతం చేయడానికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవీని సృష్టించారు.  హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్ మరణించిన తొమ్మిది నెలల తర్వాత, కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ (రిటైర్డ్)ను (Lieutenant General Anil Chauhan) కేంద్ర ప్రభుత్వం బుధవారం దేశ అత్యున్నత సైనిక అధికారిగా నియమించింది. లెఫ్టినెంట్ జనరల్ చౌహాన్ మే 2021లో ఈస్టర్న్ కమాండ్ చీఫ్‌గా పదవీ విరమణ చేశారు.

భారతదేశపు మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా పనిచేసిన జనరల్ రావత్,  ఆయన సతీమణి (Bipin Rawat)  డిసెంబరులో తమిళనాడులో మిలిటరీ హెలికాప్టర్ కూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న 13 మంది మరణించారు. ప్రాణాలతో బయటపడిన ఏకైక ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్, తరువాత తీవ్రమైన కాలిన గాయాలతో మరణించాడు. జనరల్ రావత్ (63), జనవరి 2020లో భారతదేశపు మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆర్మీ , నేవీ,  ఎయిర్ ఫోర్స్ అనే మూడు సేవలను ఏకీకృతం చేయడానికి ఈ పదవిని ఏర్పాటు చేశారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Delhi, India

ఉత్తమ కథలు