హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

నాకొద్దండీ..ఏజీగా బాధ్యతలు చేపట్టాలన్న కేంద్రం ప్రతిపాదన తిరస్కరించిన ముకుల్ రోహత్గీ

నాకొద్దండీ..ఏజీగా బాధ్యతలు చేపట్టాలన్న కేంద్రం ప్రతిపాదన తిరస్కరించిన ముకుల్ రోహత్గీ

ముకుల్ రోహత్గీ(ఫైల్ ఫొటో)

ముకుల్ రోహత్గీ(ఫైల్ ఫొటో)

Mukul Rohatgi declines Centre offer : భారత తదుపరి అటార్నీ జనరల్‌ (Attorney General of India)ఎవరనేదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రస్తుతం అటార్నీ జనరల్ గా ఉన్న కేకే వేణుగోపాల్‌(91) పదవీకాలం జూన్‌లో ముగిసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Mukul Rohatgi declines Centre offer : భారత తదుపరి అటార్నీ జనరల్‌ (Attorney General of India)ఎవరనేదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రస్తుతం అటార్నీ జనరల్ గా ఉన్న కేకే వేణుగోపాల్‌(91) పదవీకాలం జూన్‌లో ముగిసింది. అయితే మూడు నెలలపాటు వేణుగోపాల్‌(KK Venugopal) పదవీకాలాన్ని కేంద్రం పొడిగింది. ఈ నెల 30తో గడువు ముగియనుంది. వయో భారం కారణంగా మరోసారి ఆ పదవిలో కొనసాగడానికి ఆయన ఇష్టపడటం లేదు. దీంతో ప్రభుత్వం తదుపరి అటార్నీ జనరల్ గా ముకుల్‌ రోహత్గీ పేరును ప్రతిపాదించింది. అయితే అటార్నీ జనరల్‌గా నియమించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను ప్రముఖ, సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ(Mukul Rohatgi )తిరస్కరించారు. అత్యున్నత న్యాయాధికారిగా సేవ‌లందించేందుకు ఆయ‌న నిరాకరించారు.

భారత ప్రభుత్వ ప్రతిపాదనను అంగీకరించకపోవడానికి నిర్దిష్ట కారణం ఏమీ లేదని, ప్రతిపాదనను పరిశీలించి తిరస్కరించినట్లు ముకుల్ రోహత్గీ చెప్పారు. కాగా,ముకుల్ రోహత్గీ 2014 జూన్ 19 నుంచి 2017 జూన్ 18వరకు అటార్నీ జనరల్ గా బాధ్యతలు నిర్వహించారు. అప్పుడు రెండోసారి కొనసాగించడానికి ప్రభుత్వం ప్రయత్నించినా తిరస్కరించారు. దీంతో కేకే వేణుగోపాల్ కి ప్రభుత్వం ఏజీ బాధ్యతలు అప్పగించింది. తర్వాత కూడా ఆయననే కొనసాగించిన విషయం తెలిసిందే. అటార్నీ జనరల్ పదవీకాలం సాధారణంగా మూడేళ్లు ఉంటుంది.

Tourist Vehicle : లోయలో పడ్డ టూరిస్ట్ వాహనం ..ఏడుగురు మృతి,10మందికి తీవ్ర గాయాలు

ఇక,ముకుల్ రోహత్గీ భారత సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది, ఇంతకుముందు భారతదేశ అదనపు సొలిసిటర్ జనరల్‌గా పనిచేశాడు.అనేక ప్రధానమైన కేసుల్లో ఆయన సుప్రీంకోర్టుతోపాటు దేశంలోని వివిధ హైకోర్టుల్లో తన వాదనలు వినిపించారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Supreme Court

ఉత్తమ కథలు