హోమ్ /వార్తలు /జాతీయం /

ఒక్క సెల్ఫీ ప్లీజ్... ఆమె కోసం పడిచస్తున్న జనం.... ఏకంగా స్టేజీ కూలిపోయిందిగా...

ఒక్క సెల్ఫీ ప్లీజ్... ఆమె కోసం పడిచస్తున్న జనం.... ఏకంగా స్టేజీ కూలిపోయిందిగా...

నజ్రత్ జహాన్ (image : Twitter)

నజ్రత్ జహాన్ (image : Twitter)

Lok Sabha Election 2019 : సెలబ్రిటీలు ఎన్నికల్లో పాల్గొన్నా, ప్రచారం చేసినా యూత్ నుంచీ వచ్చే రెస్పాన్స్ ఓ రేంజ్‌లో ఉంటుంది... బెంగాలీ రసగుల్ల నజ్రత్ జహాన్ విషయంలో అదే జరుగుతోంది.

  Nusrat Jahan : అందమంతా ఒక్కటై... అమ్మాయిగా మారితే ప్రమాదమే అన్నాడో కవి. బెంగాల్ బ్యూటీ నజ్రత్ జహాన్ పరిస్థితి అలాగే ఉందా. తృణమూల్ కాంగ్రెస్ నుంచీ బరిలో దిగిన అభ్యర్థి బిర్బాహా సోరెన్ తరపున లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం చేస్తోందామె. ఎన్నికల ప్రచారంలో భాగంగా... ప్రజల దగ్గరకు ర్యాలీగా వెళ్లిందీ బెంగాలీ నటి. అక్కడి గోపీవల్లభపూర్‌లో పార్టీ నేతలు ఏర్పాటు చేసిన ఓ సభలో ప్రసంగిస్తుండగా... ఒక్క సెల్ఫీ ప్లీజ్ అంటూ అభిమానులు ఎగబడ్డారు. ఉప్పొంగే ప్రవాహంలా వచ్చిన వాళ్లను ఆపడం పోలీసుల వల్ల కాలేదు. చేతులెత్తేశారు. అంత మంది గుంపుగా స్టేజీ ఎక్కేసరికి... ఒక్కసారిగా ఆ స్టేజీ కుప్పకూలింది.


  లక్కీగా ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. స్టేజీ మరీ ఎత్తుగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎవరూ ఆందోళన చెందొద్దన్న జహాన్... అందరూ బాగానే ఉన్నారంటూ ప్రజలను శాంత పరిచింది.


  29 ఏళ్ల నజ్రత్ జహాన్ కూడా... బసిర్హత్‌ నియోజకవర్గం నుంచీ తృణమూల్ అభ్యర్థిగా బరిలో దిగింది. ఆమె ర్యాలీలకు భారీగా జనం వస్తున్నారు. తన అభిమానులను అలరించేందుకు ఆమె పాటలు కూడా పాడుతోంది.


   


  ఇవి కూడా చదవండి :


  ఏపీలో వైసీపీకి క్లియర్ మెజారిటీ... టీడీపీ నేత చేయించిన సర్వేలో షాకింగ్ ఫలితాలు...


  వైసీపీ గెలిస్తే, వాళ్లందరికీ జగన్ చుక్కలు చూపిస్తారా...? రెడీ అవుతున్న లిస్ట్...?


  ఈసారి ఏపీ ఫలితాలు గందరగోళమేనా... వీవీప్యాట్లు వైసీపీ, టీడీపీ, జనసేన కొంప ముంచబోతున్నాయా...


  దగ్గరవుతున్న బీజేపీ, వైసీపీ ... ఫలితాల తర్వాత పొత్తు..? ప్రత్యేక హోదా అటకెక్కినట్లేనా.. ?

  First published:

  Tags: Mamata Banerjee, Trinamool congress, West Bengal Lok Sabha Elections 2019

  ఉత్తమ కథలు