Home /News /national /

SELFIE POINT PARTIES COLLIDING DUE TO SELFIE POINT MORE THAN 100 PEOPLE INJURED EVK

Selfie Point: సెల్ఫీ పాయింట్ కార‌ణంగా కొట్టుకొన్న పార్టీలు.. 100 మందికి పైగా గాయాలు

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

Selfie Point | ఒక సెల్ఫీపాయింట్ కార‌ణంగా రెండు పార్టీల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ ఏర్ప‌డింది. ఈ ఘ‌ట‌న లాఠీచార్జ్‌కు దారి తీసింది. ఈ ఘ‌ట‌న‌లో 100 మందికి గాయాలు అయ్యాయి. ఈ ఘ‌ట‌న‌పై స్థానిక పోలీస్ అధికారిని స‌స్పెండ్ చేయ‌డంతోపాటు కోర్టు విచార‌ణ‌కు ఆదేశించింది.

ఇంకా చదవండి ...
  ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై ప్ర‌జాప్ర‌తినిధులు వాగ్వాదం చూసాం.. ఘర్ష‌ణ‌లు కూడా మ‌న‌కు తెలుసు. అయితే వింత‌గా ఒక సెల్ఫీపాయింట్ కార‌ణంగా రెండు పార్టీల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ ఏర్ప‌డింది. ఈ ఘ‌ట‌న లాఠీచార్జ్‌కు దారి తీసింది. అస‌లు ఏం జ‌రిగిందంటే.. మ‌ధ్య ప్ర‌దేశ్‌ (Madhya Pradesh) రాష్ట్రం.. ఎంపీ సాగర్ జిల్లాలోని ఖురాయ్ పట్టణంలో గురువారం ప్రతిపక్ష కాంగ్రెస్ కార్యకర్తల మ‌ధ‌య ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. వీటిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘ‌ట‌న‌లో 100మందికి పైగా గాప‌డ్డారు. ఆభ్చ‌ర్య‌క‌క‌రంగా ఎక్కువ‌గా అధికార పార్టీకి చెందిన బీజేపీ (BJP) నాయ‌కులే తీవ్ర‌గాయాల‌పాల‌వ్వ‌డం విశేషం. ఈ లాఠీ చార్జ్‌లో ఆరుగురు బిజెపి కార్యకర్తలకు తీవ్ర‌గాయాలు అయ్యాయి. మాజీ మున్సిపల్ కౌన్సిలర్ వినోద్ రాజ్‌హాన్స్‌తో సహా వారిలో ముగ్గురికి తలకు గాయాలయ్యాయి. వీరిని వెంట‌నే చికిత్స కోసం భోపాల్‌కు తరలించారు.

  రాజన్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘ‌ట‌న‌పై అస‌లేం జ‌రిగింద‌ని మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. అంతే కాకుండా త‌క్ష‌ణం ఖురాయ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ సస్పెండ్ చేశారు.

  Bal Puraskar Award: ఏడేళ్ల బాలిక‌కు పీఎం బాల్ పుర‌స్కార్ అవార్డు.. అద్భుత ఆవిష్క‌ర‌ణ‌కు గుర్తింపు!

  అస‌లేం జ‌రిగింది..
  ఖురాయ్ ప‌ట్ట‌ణంలో ఇటీవల సెల్ఫీ పాయింట్‌ (Selfie Point) ను ఎవ‌రో పాడు చేశారు. దీనిపై స్థానిక SDMకి మెమోరాండం సమర్పించేందుకు ప్రత్యర్థి రాజకీయ పార్టీల రెండు వేర్వేరు ఊరేగింపులు వెళ్లాఇయ‌. ఈ ఘ‌ట‌న‌లో రెండు పార్టీల కార్యకర్తల మధ్య హింస, పోలీసు లాఠీచార్జి జరిగింది. ఖురాయ్ ఎంపీ మాజీ హోం మంత్రి, ప్రస్తుత పట్టణాభివృద్ధి మరియు హౌసింగ్ మంత్రి భూపేంద్ర సింగ్ అసెంబ్లీ నియోజకవర్గం కావ‌డం విశేషం.

  జనవరి 17న స్థానిక మున్సిపాలిటీ నిర్మించిన సెల్ఫీ పాయింట్ పాడైంది. ఈ ఘటనకు సంబంధించి కొందరు కాంగ్రెస్ కార్యకర్తలతో సహా ఎనిమిది మందిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. మూడు రోజుల క్రితం, స్థానిక కాంగ్రెస్ (Congress) నాయకత్వం తమ కార్యకర్తలపై ఎఫ్ఐఆర్ నమోదుకు వ్యతిరేకంగా స్థానిక పరిపాలనకు మెమోరాండం సమర్పించాలని ప్రకటించింది. ప్రకటించిన మేరకు మాజీ ఎమ్మెల్యే అరుణోదయ్ చౌబే ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు స్థానిక ఎస్‌డిఎంకు వినతి పత్రం సమర్పించేందుకు ఊరేగింపు నిర్వహించారు.

  WhatsApp: వాట్స‌ప్ వాడుతున్నారా.. అయితే ఈ ఫీచ‌ర్స్‌.. జాగ్ర‌త్త‌లు తెలుసుకోండి!

  అదే సమయంలో, లఖన్ సింగ్ ఠాకూర్ (స్థానిక ఎమ్మెల్యే మరియు క్యాబినెట్ మంత్రి భూపేంద్ర సింగ్ మేనల్లుడు) నేతృత్వంలోని అధికార బీజేపీ కార్యకర్తలు కూడా సెల్ఫీ పాయింట్ డ్యామేజ్ కేసులో పోలీసులు బుక్ చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఖురాయ్ తహసీల్‌కు ఊరేగింపుగా వెళ్లారు.
  అయితే ఊరేగింపులు SDM కార్యాలయం, తహసీల్ కార్యాల‌యానికి చేరుకున్నప్పుడు రెండు పార్టీల కార్యకర్తలు ఒకరితో ఒకరు ఘర్షణ పడ్డారు. రెండు గుంపులు రాళ్లదాడికి పాల్పడడంతో చివరకు పోలీసులు లాఠీచార్జి చేయవలసి వచ్చింది. ఈ ఘ‌ట‌న‌పై స్థానిక ఎమ్మెల్యే, మంత్రి భూపేంద్ర‌సింగ్ పార్టీ కార్యకర్తలతో కలిసి నిరసన తెలిపారు.
  ఈ మొత్తం ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత డిమాండ్ చేశారు. గాయపడిన వారిలో కనీసం 15 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అరుణోదయ చౌబే ఆరోపించారు.
  Published by:Sharath Chandra
  First published:

  Tags: Bjp, Congress, India news, Madhya pradesh

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు