పార్లమెంట్ గేట్‌లోకి దూసుకెళ్లిన కారు..ఢిల్లీలో హై అలర్ట్..2001 ఉగ్రదాడి ఇలాగే..

2001 పార్లమెంట్ దాడి ఘటన ఇలాగే జరిగింది. ఎగ్జిట్ గేట్ నుంచి లోపలికి దూసుకొచ్చిన ఐదుగురు ఉగ్రవాదులు...పార్లమెంట్‌లో బీభత్సం సృష్టించారు. వస్తూనే కాల్పులతో విరచుకుపడ్డారు. ఆ ఘటనలో 9 మంది చనిపోయారు.

news18-telugu
Updated: February 12, 2019, 3:23 PM IST
పార్లమెంట్ గేట్‌లోకి దూసుకెళ్లిన కారు..ఢిల్లీలో హై అలర్ట్..2001 ఉగ్రదాడి ఇలాగే..
ఎగ్జిట్ గేట్ నుంచి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన కారు
  • Share this:
ఢిల్లీలో తీవ్ర కలకలం రేగింది. పార్లమెంట్ ఆవరణలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఎగ్జిట్ గేట్ నుంచి లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో.. భద్రతా సిబ్బంది ఉలిక్కిపడ్డారు. ఐతే రాంగ్ గేట్ నుంచి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో..సెన్సార్‌లు యాక్టివేట్ అయ్యాయి. వెంటనే ఇనుప చువ్వలు, బారీకేడ్ పైకి చొచ్చుకురావడంతో కారు అక్కడే ఆగిపోయింది. ఇరన్ స్పైక్స్‌ బలంగా తాకడంతో కారు బంపర్ దెబ్బతింది. వెంటనే సెక్యూరిటీ సైరన్ రావడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. గేట్ దగ్గరికి పరిగెత్తి డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై భద్రతా సిబ్బంది విచారణ జరుపుతున్నారు.

ఎగ్జిట్ గేట్ నుంచి పార్లమెంట్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆ కారు నెంబర్ DL 12 CH 4897. మణిపూర్ ఎంపీ తోక్చామ్ మీన్యా (కాంగ్రెస్)కి చెందిన కారుగా పార్లమెంట్ భద్రతా సిబ్బంది గుర్తించారు. పార్లమెంట్ వెలుపల భారీగా సెక్యూరిటీ ఉంటుంది. వారిని దాటుకొని కారు ఎగ్జిట్ గేట్ వరకు ఎలా వచ్చిందన్న దానిపై అధికారులు దర్యాప్తుచేస్తున్నారు. పార్లమెంట్ ఆవరణలో హైఅలర్ట్ ప్రకటించారు. పోలీసులు, కేంద్ర బలగాలు భారీగా మోహరించాయి. ఈ ఘటనతో ఎంపీలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యంపై ఆందోళన వ్యక్తం చేశారు.
కాగా, 2001 పార్లమెంట్ దాడి ఘటన ఇలాగే జరిగింది. ఎగ్జిట్ గేట్ నుంచి లోపలికి దూసుకొచ్చిన ఐదుగురు ఉగ్రవాదులు...పార్లమెంట్‌లో బీభత్సం సృష్టించారు. వస్తూనే కాల్పులతో విరుచుకుపడ్డారు. ఆ ఘటనలో 9 మంది చనిపోయారు. మృతుల్లో ఐదుగురు ఢిల్లీ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ మహిళా కానిస్టేబుల్, ఇద్దరు పార్లమెంట్ సిబ్బంది, ఓ జర్నలిస్ట్ ఉన్నారు. భద్రత దళాల ఎదురుకాల్పుల్లో ఉగ్రవాదులు హతమయ్యారు. ఇప్పుడు కూడా అదే గేట్ నుంచి కారు దూసుకురావడంతో అందరూ ఉలిక్కిపడ్డారు.First published: February 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...