ఏటీఎం సెంటరే అతడికి స్డడీ రూం.. వైరల్ గా మారిన ఫొటో.. ‘నీ డెడికేషన్ కు సలాం’ అంటూ నెటిజన్ల కామెంట్..

ఏటీఎం మిషన్ సెంటర్ లో చదువుతున్న అభ్యర్థి (Image source - twitter)

Viral Photo : ఈ రోజుల్లో అభ్యర్థులు తల్లిదండ్రులు బలవంతం చేస్తే కానీ చదవరు. కానీ ఇక్కడ తను ఉద్యోగం చేస్తూ కూడా తన ఇష్టమైన చదువును ఏటీఎం సెంటర్ లో కొనసాగిస్తున్నాడు ఓ వ్యక్తి. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇతని ఏకాగ్రత, పట్టుదలకు నెటిజన్లు నీ డెడికేషన్‌ లెవల్‌కి నా సలాం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

 • Share this:
  ఈ రోజుల్లో అభ్యర్థులు తల్లిదండ్రులు బలవంతం చేస్తే కానీ చదవరు. కానీ ఇక్కడ తను ఉద్యోగం చేస్తూ కూడా తన ఇష్టమైన చదువును ఏటీఎం సెంటర్ లో కొనసాగిస్తున్నాడు ఓ వ్యక్తి. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇతని ఏకాగ్రత, పట్టుదలకు నెటిజన్లు నీ డెడికేషన్‌ లెవల్‌కి నా సలాం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ ఫొటో మాత్రం చదవుకు కావాల్సింది ఆసక్తి, శ్రద్ధ మాత్రమేనని చాటి చెబుతోంది. లక్ష్యాన్ని చేరకోవాలంటే కావాల్సింది ఏకాగ్రత, పట్టుదలేనని నిరూపిస్తూ ఓ యువకుడు తన ఉద్యోగ బాధ్యతను నిర్వర్తిస్తూనే తనకిష్టమైన చదువును కోనసాగిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్‌ చల్‌ చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది.

  తన కుటుంబానికి చదివించే ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఓ యువకుడు ఏటీఎం కేం‍ద్రంలో సెక్యూరిటీ గార్డుగా చేరాడు. చేసే పని చిన్నదా పెద్దదా అనేది ఆలోచించకుండా తన కుటుంబాన్ని పోషించడానికి ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. అయితే రాత్రి పూట కస్టమర్ల తాకిడి పెద్దగా ఉండదు కాబట్టి ఆ సమయంలో ఖాళీగా ఉండడం కన్నా చదువుకోవడం బెటర్‌ అని భావించాడు. ఇంకేముంది ఏటీఎం కేంద్రంలోనే చదవడం మొదలు పెట్టాడు. చదవాలనే కోరిక ఉంటే చాలు కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకొని చదుకునే వీలుంటుందని నిరూపించాడు.

  ఈ ఫోటోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ తన ట్విట్టర్ ఖాతా‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో ఇలాంటి విద్యార్థి ఉన్నాడా అంటూ కొందరు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ ఒక్కరు ఇలా ఏకాగ్రతతో చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇది ఎక్కడ జరిగిందనే వివరాలు తెలియరాలేదు. కలెక్టర్లు, ఐపీఎస్ అయిన వారు కూడా ఇలా సెక్యూరిటీ గార్డ్ లుగా పని చేశారంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.
  Published by:Veera Babu
  First published: