Home /News /national /

SECURITY FORCES RECOVERS 40 KG OF EXPLOSIVES FROM JAMMU AND KASHMIRS KATHUA REGION BS

కాశ్మీర్‌లో పుల్వామా తరహా ఉగ్రదాడికి కుట్ర.. పోలీసుల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు..

ప్రతీకాత్మక చిత్రం(File Image : PTI)

ప్రతీకాత్మక చిత్రం(File Image : PTI)

సోమవారం జమ్మూ కాశ్మీర్‌లోని కథువా ప్రాంతంలోని దెవాల్‌ గ్రామంలో 40 కిలోల భారీ పేలుడు సామాగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.

సరిహద్దులో మరో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు కుట్ర పన్నారా? పుల్వామా తరహాలో దాడులకు ప్లాన్ వేశారా? అంటే తాజా పరిణామాలు అవుననే జవాబిస్తున్నాయి. సోమవారం జమ్మూ కాశ్మీర్‌లోని కథువా ప్రాంతంలోని దెవాల్‌ గ్రామంలో 40 కిలోల భారీ పేలుడు సామాగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. సరిహద్దులో దాడికి ఉగ్రవాదులు ప్లాన్ వేస్తున్నారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో సరిహద్దు భద్రత బలగాలు కొద్దిరోజులుగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈ తనిఖీల్లో భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు దొరకడం సంచలనం సృష్టించింది. సరిహద్దు ద్వారా 500 మంది ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చెప్పిన కొన్ని నిమిషాల్లోనే పేలుడు పదార్థాలు దొరకడం గమనార్హం.

బాలాకోట్‌లోని ఉగ్రవాద స్థావరాలు మళ్లీ ఇటీవల యాక్టివేట్‌ అయ్యాయని, దాయాది దేశం వీటిని యాక్టివేట్‌ చేసిందని రావత్ వెల్లడించారు. చెన్నైలోని ఆఫీసర్ ట్రెయింగ్ అకాడమీలో కొత్త బ్యాచ్‌ శిక్షణ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన.. సరిహద్దుల్లో భారీగా సైనికులను మోహరించామని, బాలకోట్ దాడులకు మించి వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నామని, ఈ విషయంలో ఏమాత్రం సంకోచించబోమని స్పష్టం చేశారు.
Published by:Shravan Kumar Bommakanti
First published:

Tags: Jammu and Kashmir, Jammu kashmir, Pulwama Terror Attack, Terror attack, Terrorists

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు