చత్తీస్గఢ్ లో మావోయిస్టులు , భద్రతాబలగాలకు మధ్య తీవ్ర పోరు కొనసాగుతోంది. ఒకరిపై
ఒకరు పైచేయి సాధిచేందుకు ఎత్తుకుపైఎత్తులు వేస్తున్నారు. నేపథ్యంలోనే ఒకరిపై ఒకరు దాడులకు పూనుకుంటున్నారు. బస్తార్ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఇలాంటీ ప్రేరపించే సంఘటనలు తీవ్రమయ్యాయి.
ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 19 తెల్లవారుజామున బాంబులను విసిరినట్టు మావోయిస్టు జోనల్ కమిటీ అధికార ప్రతినిధి ఓ లేఖు విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే అడవిలో మావోయిస్టులు ఉన్నారంటూ మొత్తం 12 బాంబులను డ్రోన్ సహయంతో వేశారని మావోయిస్టులు ఆరోపించారు. దీనికి
సంభందించిన ఫోటోలు మరియు వీడియోలను వారు విడుదల చేశారు. అయితే గగతనలం నుండి మావోయిస్టులపై బాంబులు వేయడం ఇదే మొదటిసారని చెబుతున్నారు. పోలీసులు నేరుగా మావోయిస్టులతో తలపడిన సంఘటనలు ఉన్నా.. రాత్రిపూట బాంబులు వేయడంతో కొత్త కోణంలో
మావోయిస్టులను ఎదుర్కోనేందుకు పోలీసుల ఎత్తుగడగా భావించాలి.
అయితే మావోయిస్టులు చేస్తున్న ఆరోపణలు భద్రతా సిబ్బంది అధికారులు కొట్టిపారేశారు. అవన్ని నిరాధారమైన ఆరోపణలుగా పేర్కోన్నారు. మావోయిస్టులు తమని కాపాడుకునేందుకు వారిలో ఉన్న భయం , గందరగోళంలో ఇలాంటీ ప్రకటనలు చేస్తున్నారని తెలిపారు. భద్రతా దళాలు , స్థానిక ప్రజల ఆస్తులు మరియు వారి ప్రాణాలను కాపాడలనే ఓకే ఒక లక్ష్యంతో చట్టబద్దంగా పనిచేస్తాయని తెలిపారు.
ఇక సిపిఐ మావోయిస్టు కార్యకర్తలు మరియు పేలుడు పదార్థాలను ఉపయోగించి వేలాది మంది అమాయక పౌరుల ప్రాణాలను తీశారని వారు ఆరోపించారు.. ఐఇడి లను ఉపయోగిస్తూ.. భద్రతా దళాలకు హాని కలిగించే ప్రయత్నాలలో మావోయిస్టులు పిల్లలు, మహిళలు మరియు జంతువులను కూడ వాడుకుంటారని భద్రతా దళాలు ఆరోపించాయి. కాగా తాజాగా కూడా నారాయణపూర్లో ఒక ఐటిబిపి అధికారి మావోయిస్టుల దాడిలో తీవ్రంగా గాయపడ్డారని మరియు మావోయిస్టులు పేల్చిన ఐఇడి బాంబులో ఒక ఆవు కూడ చనిపోయిందని వివరించారు..