SECURITY COVER REDUCED FOR SACHIN TENDULKAR AND ADITYA THACKERAY GETS AN UPGRADE MS
సచిన్ భద్రత కుదింపు.. ఆదిత్య థాక్రే భద్రత పెంపు..
సచిన్ టెండూల్కర్,ఆదిత్య థాక్రే (File Photo)
భారతరత్న సచిన్ టెండూల్కర్ భద్రతను మహారాష్ట్ర ప్రభుత్వం కుదించింది. ఇప్పటివరకు ఉన్న 24 గంటల సెక్యూరిటీని తొలగించింది. అయితే ఎస్కార్ట్ మాత్రం కొనసాగనుంది.
భారతరత్న సచిన్ టెండూల్కర్ భద్రతను మహారాష్ట్ర ప్రభుత్వం కుదించింది. ఇప్పటివరకు ఉన్న 24 గంటల సెక్యూరిటీని తొలగించింది. అయితే ఎస్కార్ట్ మాత్రం కొనసాగనుంది. ప్రస్తుతం సచిన్‌కు ఎక్స్ కేటగిరి భద్రత కొనసాగుతోంది. ఇక ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన శివసేన ఎమ్మెల్యే ఆదిత్య థాక్రేకి ప్రభుత్వం భద్రతను పెంచింది. ఆదిత్య థాక్రేకి ఇప్పటివరకు ఉన్న వై ప్లస్ భద్రతను జెడ్ ప్లస్‌కి పెంచింది. బీజేపీ నేత ఏక్నాథ్ ఖడ్సేకి ఇప్పటివరకు ఉన్న వై కేటగిరీ భద్రతతో పాటు ఎస్కార్ట్‌ను తొలగించారు.ఇకపై ఆయనకు ఎలాంటి భద్రత ఉండదు.
మాజీ బీజేపీ నేత,ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్ సెక్యూరిటీని జెడ్ ప్లస్ కేటగిరి నుంచి ఎక్స్ కేటగిరికి కుదించారు.
మహారాష్ట్రలో మొత్తం 97 మందికి ప్రత్యేక భద్రత అందిస్తుండగా.. ఇందులో 29మంది భద్రతకు సంబంధించి మార్పులు చేర్పులు చేశారు. మరో 16 మందికి భద్రతను పూర్తిగా తొలగించింది. ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం ఆయా వ్యక్తుల భద్రతా ముప్పును పరిగణలోకి తీసుకుని తాజా మార్పులు చేశారు.