Home /News /national /

SECUNDERABAD VIOLENCE PETROL BOMB HURLED IN COACHES RAILWAY OFFICIAL SHOWS PROOF OF PRE PLANNED RIOTS IN AGNEEPATH PROTESTS SK

Secunderabad: రైలు బోగీల్లోకి పెట్రోల్ బాంబులను విసిరిన ఆందోళనకారులు.. ప్రాణభయంతో ప్రయాణికులు పరుగులు

రైలు లోపలి దృశ్యాలు

రైలు లోపలి దృశ్యాలు

Secunderabad Railway Station: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో హింసాత్మక ఘటనలపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇది అనుకోకుండా జరిగిన ఘటన కాదని.. పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందని రైల్వే సిబ్బంది ఆరోపిస్తున్నారు.

  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ (Secunderabad Train Station)లో హింసాత్మక ఘటనలపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇది అనుకోకుండా జరిగిన ఘటన కాదని.. పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందని.. అక్కడి పరిస్థితులను చూస్తే అర్ధమవుతోందని.. రైల్వే సిబ్బంది చెబుతున్నారు. కొందరు ఆందోళనకారులు పెట్రోల్ బాంబులను విసిరారు. బోగీల్లో ప్రయాణికులు ఉన్న సమయంలోనే పెట్రోల్ బాంబుల(Petrol Bombs)ను, రాళ్లను విసరడంతో.. వారంతా ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. తమ వెంట తెచ్చుకున్న సామాను, వస్తువులను అక్కడే వదిలిపెట్టి.. పారిపోయారు. అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు సీఎన్ఎన్-న్యూస్ 18 ప్రతినిధి.. దగ్ధమైన ఓ రైలులోకి వెళ్లారు. అక్కడి పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చూపించారు. మంటల్లో కాలిపోయిన ఆ రైలులో అన్నీ బోగీలు చెత్తా చెదారంతో నిండిపోయాయి. ప్రయాణికులు ఎక్కడికక్కడే తమ వస్తువులను వదిలిపెట్టి పారిపోయిన ఆనవాళ్లు ఉన్నాయి. ఓ సీటుపై పెట్రోల్ బాంబు కూడా కనిపించింది.  ఆందోళనకారులో చాలా మంది విద్యార్థుల్లా కనిపించలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. విద్యార్థులైతే కర్రలు, ఐరన్ రాడ్లతో స్టేషన్‌లో ఎందుకు దాడులు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. కొందరు ఆందోళనకారులు రైల్వే స్టేషన్‌లో ఉన్న షాపులను లూటీ చేశారని.. పెద్ద మొత్తంలో డబ్బులు ఎత్తుకెళ్లారని షాపుల యజమానులు చెప్పారు. తమపై కర్రలతో దాడి చేసినట్లు వారు వెల్లడించారు. అది అల్లరి మూకల పనిగా అనిపిస్తోందని.. పక్కా ప్లాన్‌తోనే ఇంతటి విధ్వంసానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఆందోళనకారుల్లో చాలా మంది ఐరన్ రాడ్లతో సిగ్నలింగ్ వ్యవస్థను కూడా ధ్వంసం చేశారు. పోలీసులపైకి పెద్ద పెద్ద రాళ్లను విసిరారు.

  రైల్వే స్టేషన్‌లో ఉన్న కొందరు విద్యార్థులు కూడా.. ఈ హింసాత్మక ఘటనల వెనక ఉన్న కోట్ర కోణంపై అనుమానాలు వ్యక్తం చేశారు. తాము శాంతియుతంగానే నిరసన తెలపడానికి వచ్చామని.. కానీ తమ నిరసన కార్యక్రమం గురించి కొందరు వ్యక్తులకు ముందే తెలిసి.. విద్యార్థుల ముసుగులో విధ్వంసానికి పాల్పడినట్లు చెప్పారు. బయటి వ్యక్తులే.. రైల్వే స్టేషన్‌లో దాడులకు పాల్పడినట్లు వారు ఆరోపించారు. సికింద్రాబాద్‌లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో రైల్వే పోలీసులు.. స్టేషన్‌లో భారీగా మోహరించారు. నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్‌లను కూడా మూసివేశారు. హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్, మెట్రో సర్వీసులు నిలిచిపోయాయి. సికింద్రాబాద్‌ వైపు వచ్చే రైళ్లను.. ఎక్కడిక్కడే నిలిపివేశారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన రైల్వే స్టేషన్‌లలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Agnipath Protest, Secunderabad, Secunderabad railway station, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు