హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Covid-19: టీకా 2డోసులు పొందినా కరోనాకు బలి -వారంలో ఇద్దరు మృతి -ఏం జరుగుతోంది?

Covid-19: టీకా 2డోసులు పొందినా కరోనాకు బలి -వారంలో ఇద్దరు మృతి -ఏం జరుగుతోంది?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా కరోనా వ్యాధికి గురై, చివరికి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇతర ఆరోగ్య సమస్యలేవీ లేకున్నా, పూర్తి స్థాయిలో వ్యాక్సిన్లు పొందినా కేవలం కరోనా కారణంగానే జనం చనిపోతున్నారు.

ఇంకా చదవండి ...

మృత్యుబేహారి కరోనా మహమ్మారికి విరుగుడు వ్యాక్సిన్ (vaccine) మాత్రమేనని, టీకాలు పొందితే కరోనా కాటు నుంచి బయటపడొచ్చనే ప్రచారం ఉధృతంగా సాగుతోన్న క్రమంలో భిన్న ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. కొవిడ్-19  (covid-19) టీకా రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా కరోనా వ్యాధికి గురై, చివరికి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇతర ఆరోగ్య సమస్యలేవీ లేకున్నా, పూర్తి స్థాయిలో వ్యాక్సిన్లు పొందినా కేవలం కరోనా కారణంగానే జనం చనిపోతున్నారు. ఒక్క మధ్యప్రదేశ్ లోనే వారం రోజుల వ్యవధిలో.. వ్యాక్సినేషన్ పూర్తయిన ఇద్దరు వ్యక్తులు కొవిడ్ కాటుకు మరణించారు. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందిప్పుడు.

కొవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ కరోనా బారినపడి మధ్యప్రదేశ్‌లో ఇద్దరు మరణించారు. పూర్తిగా టీకాలు వేయించుకున్న 54 ఏళ్ల మహిళకు ఈ నెల 15న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, భోపాల్‌ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆమె గురువారం అర్ధరాత్రి తర్వాత చనిపోయారు. చనిపోయేసమయానికి ఆమెకు ఎలాంటి ఇతర అనారోగ్య సమస్యలు లేవని, కొవిడ్ తప్ప మిగతా అంశాల్లో ఆమె ఆరోగ్యం మెరుగ్గా ఉన్నా మరణం తప్పలేదని భోపాల్ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (CMHO) డాక్టర్ ప్రభాకర్ తివారీ తెలిపారు.

Australia : కొవిడ్ వ్యాక్సిన్లకు వ్యతిరేకంగా భారీ నిరసనలు -కరోనా ఆంక్షలపైనా జనం తిరుగుబాటు


రెండు డోసుల తర్వాత కూడా కొవిడ్ కాటుకు గురైన మహిళకు కేవలం సాధారణమైన తేలికపాటి రక్తపోటు సమస్య మాత్రమే ఉందని, ఆమె భర్త కూడా ప్రభుత్వ డాక్టరేనని డాక్టర్ తివారీ గుర్తుచేశారు. మరోవైపు టీకా రెండు డోసులు తీసుకున్న 69 ఏళ్ల వ్యక్తి గత ఆదివారం రాత్రి ఇండోర్‌లో మరణించాడు. తాజా ఘటనతో పూర్తిగా వ్యాక్సిన్లు పొందిన ఇద్దరు వ్యక్తులు వారంరోజుల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయినట్లయింది. ఈ మరణాలపై సమగ్ర పరిశీలన చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే,

China : మరో 18 ప్రమాదకర వైరస్‌లు -చైనా మాంసం మార్కెట్లలో గుర్తించిన సైంటిస్టులు


దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగంగా సాగుతున్నది. రాష్ట్రాల‌కు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు ఇప్ప‌టివ‌ర‌కు 129 కోట్ల వ్యాక్సిన్ డోసులు స‌ర‌ఫ‌రా చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ‌ శనివారం వెల్ల‌డించింది. 2021, జ‌న‌వ‌రి 16న‌ దేశంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ మొద‌లుకాగా, జూన్ 21 నుంచి దేశవ్యాప్తంగా ఉచిత వ్యాక్సిన్ల పంపిణీ ప్రక్రియ ఊపందుకుంది. భారత్ లో ఇప్పటిదాకా 3.44కోట్ల కొవిడ్ కేసులు నమోదుకాగా, 4.65లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

Published by:Madhu Kota
First published:

Tags: Covid, Covid cases, Death, Madhya pradesh

ఉత్తమ కథలు