HOME »NEWS »NATIONAL »seafarers who stuck in china are coming back to india says mansukh mandvaiya ba

చైనాలో చిక్కుకున్న భారత నావికుల కుటుంబానికి తీపి కబురు.. వారు వచ్చేస్తున్నారు

చైనాలో చిక్కుకున్న భారత నావికుల కుటుంబానికి తీపి కబురు.. వారు వచ్చేస్తున్నారు
ప్రతీకాత్మక చిత్రం (FIle: Image; Twitter)

చైనాలో చిక్కుకున్న భారత నావికుల కుటుంబానికి తీపి కబురు. భారత ప్రభుత్వం చేసిన దౌత్యం ఫలించింది. 23 మంది భారత నావికులు తిరిగి స్వదేశానికి చేరుకోనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర పోర్టులు, షిప్పింగ్, వాటర్ వేస్ సహాయ మంత్రి మన్సుక్ మాండవీయ తెలిపారు.

  • Share this:
    చైనాలో చిక్కుకున్న భారత నావికుల కుటుంబానికి తీపి కబురు. భారత ప్రభుత్వం చేసిన దౌత్యం ఫలించింది. 23 మంది భారత నావికులు తిరిగి స్వదేశానికి చేరుకోనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర పోర్టులు, షిప్పింగ్, వాటర్ వేస్ సహాయ మంత్రి మన్సుక్ మాండవీయ తెలిపారు. ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని పంచుకున్నారు. ‘చైనాలో చిక్కుకున్న మన నావికులు తిరిగి వచ్చేస్తున్నారు. ఎంవీ జాగ్ అనంద్ అనే షిప్‌లో 23 మంది నాకులు జపాన్‌లోని చీబా వెళ్తుండగా చైనాలో చిక్కుకున్నారు. వారు జనవరి 24న భారత్‌కు చేరుకుంటారు. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బలమైన నాయకత్వం ద్వారానే సాధ్యమైంది.’ అని మన్సుక్ మాండవీయ తెలిపారు. అలాగే, 23 మంది భారతీయ నావికులను స్వదేశానికి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించి, మానవతా దృక్పధంతో స్పందించిన గ్రేట్ ఈస్ట్రన్ షిప్పింగ్ కంపెనీకి ధన్యవాదాలు తెలిపారు. నావికులు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ కంపెనీ అందించిన సహకారాన్ని అభినందించారు.

    సరుకు రవాణా చేసే షిప్ జూన్ 13న చైనా ఆధీనంలో ఉన్న జలాల్లో ఆగిపోయింది. ఎంవీ జగన్నాథ్ అనే షిప్ జూన్ 13 నుంచి చైనాలోని జింగ్ టాంగ్ పోర్టులో నిలిచిపోయింది. అందులో 23 మంది భారత నావికులు ఉన్నారు. మరోవైపు ఎంవీ అనస్తాసియా అనే మరో షిప్‌లో మరో 16 మంది భారతీయులు చైనాలోని కావోఫీడియన్ పోర్టులో చిక్కుకున్నారు. వారు సెప్టెంబర్ 20 నుంచి అక్కడే ఉండిపోయారు. సరుకు దించడానికి ఆ రెండు షిప్పులు ఎదురుచూస్తున్నాయని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి 2020 డిసెంబర్ 30న చెప్పినట్టు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.







    చైనా ప్రభుత్వ అధికారులతో భారత ప్రభుత్వం దౌత్యపరమైన చర్చలు జరుపుతోందని అప్పుడు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి శ్రీవాస్తవ చెప్పారు. భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు దౌత్యపరమైన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో వారు మళ్లీ స్వదేశానికి రానున్నారని, జనవరి 14న వారంతా మళ్లీ భారత్ చేరుకుంటారని తాజాగా మన్సుక్ మాండవీయ చెప్పారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:January 09, 2021, 14:12 IST