ఇద్దరూ ఒకే అమ్మాయిని ఇష్టపడ్డారు.. ఆమె కోసం నడిరోడ్డు పైనే..

ప్రతీకాత్మక చిత్రం

శుక్రవారం రాత్రి లసూరు గేట్‌ సమీపంలోని ధర్మరాయ దేవాలయం వద్ద నిర్వహించిన ఓ ఉత్సవానిరి వీరిద్దరు వచ్చారు. ఇద్దరు ఒకరికి ఒకరు ఎదురుపడటంతో ఆగ్రహంతో ఊగిపోయారు.

  • Share this:
    వాళ్లిద్దరూ ఒకే అమ్మాయిని ఇష్టపడ్డారు. ఆమె తనదంటే తనదే అని కొంతకాలంగా ఘర్షణ పడుతున్నారు. ఇదే క్రమంలో శుక్రవారం ఓ దేవాలయం వద్ద ఇద్దరూ ఎదురెదురు పడ్డారు. అంతే.. అమ్మాయి కోసం మళ్లీ గొడవపడ్డారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. బెంగళూరులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

    వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని హలనూరు ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు ఒకే యువతిని ఇష్టపడుతున్నారు. ఆమె కోసం కొన్నాళ్లుగా గొడవపడుతూ వస్తున్నారు. శుక్రవారం రాత్రి లసూరు గేట్‌ సమీపంలోని ధర్మరాయ దేవాలయం వద్ద నిర్వహించిన ఓ ఉత్సవానిరి వీరిద్దరు వచ్చారు. ఇద్దరు ఒకరికి ఒకరు ఎదురుపడటంతో ఆగ్రహంతో ఊగిపోయారు. అమ్మాయి విషయంలో ఇద్దరి మధ్య మళ్లీ వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసింది. అందరూ చూస్తుండగానే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. నడిరోడ్డుపై రచ్చ చేయడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
    First published: