Delhi pollution : ఢిల్లీ కాలుష్యం ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న నేపథ్యంలో స్కూళ్లకు సెలవులను కంటిన్యూ చేస్తున్నట్టు ఢిల్లీ రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. స్కూళ్ల ఓపెనింగ్‌పై నోటిసులు ఇచ్చేవరకు బంద్ చేయాలని పేర్కోన్నారు.
ఢిల్లీలో వాతవరణ కాలుష్యం ఇంకా విద్యార్థులను వీడడం లేదు.. స్కూళ్లు మూసి వారం రోజులు గడుస్తున్నా.. ఇంకా అదే పరిస్థితి కొనసాగుతోంది. దీంతో భవిష్యత్‌లో ప్రకటన చేసేవరకు ఎవరు స్కూళ్లు ఓపెన్ చేయవద్దని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో మరో కొద్ది రోజుల పాటు స్కూళ్లు మూతపడనున్నట్టు తెలుస్తోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గతం వారం రోజుల క్రితం కీలక నిర్ణయం తీసుకున్నారు. కాలుష్యంపై సమీక్షించిన సీఎం వారం రోజుల పాటు స్కూళ్లకు సెలవు ఇవ్వడంతోపాటు ప్రభుత్వ అధికారులకు వర్క్ ఫ్రం హోంను ప్రకటించారు..
దేశ రాజధానిలో వాయు కాలుష్యం ప్రమాదకరస్ధాయికి చేరడంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గత శనివారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కాలుష్య నియంత్రణకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపధ్యంలో కేజ్రీవాల్ ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో స్కూళ్లకు వారం రోజుల పాటు సెలవులు ప్రకటించడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు వర్క్ ఫ్రం హోమ్ ప్రకటించారు. అయితే ఢిల్లీ ఇంకా కాలుష్యం కోరల నుండి బయటికి రాని పరిస్థితి కనిపిస్తోంది.
కాగా అంతకు ముందు జాతీయ రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్యం అత్యవసర పరిస్థితిని తలపిస్తోందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కాలుష్య నియంత్రణకు తక్షణ చర్యలు చేపట్టాలని సర్వోన్నత న్యాయస్ధానం పేర్కొంది. ఢిల్లీలో లాక్డౌన్ విధించే ప్రతిపాదననూ పరిశీలించాలని కోరింది. కాలుష్య నియంత్రణకు సత్వరమే చర్యలు చేపట్టి నివేదిక సమర్పించాలని ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వాలను సర్వోన్నత న్యాయస్ధానం ఆదేశించింది. ఇళ్లలో కూడా మాస్క్ పెట్టుకుని ఉండాల్సిన పరిస్థితి నెలకొందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.
మరోవైపు ఉష్ణోగ్రత తగ్గుదల, గాలి వేగం కారణంగా ఢిల్లీలో పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని పీసీబీ పేర్కొంది. వాయు కాలుష్యాన్ని పరిష్కరించడానికి అత్యవసర చర్యల కోసం పూర్తి సంసిద్ధతతో ఉండాలని రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలను పీసీబీ ఆదేశించింది.
కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం.. ఢిల్లీని పొగ మంచు కమ్మేయడంతో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 470ని తాకింది. గాలిలో ఈ స్థాయి కాలుష్యం ఉంటే గాలి ఆరోగ్యకరమైన వ్యక్తులను ప్రభావితం చేస్తుంది. ఇప్పటికే వ్యాధులతో బాధపడుతున్న వారిపై తీవ్రంగా ప్రభావం చూపుతుంది. ఇక ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లోని వ్యవసాయ భూముల్లో పంట వ్యర్థాలను కాల్చడం వల్ల విషపూరితమైన పొగమంచు ఢిల్లీలో వ్యాపిస్తున్న విషయం తెలిసిందే..
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.