హోమ్ /వార్తలు /జాతీయం /

భారత్-పాక్ ఉద్రిక్తతలు : సరిహద్దు సమీపంలోని స్కూల్స్ బంద్..

భారత్-పాక్ ఉద్రిక్తతలు : సరిహద్దు సమీపంలోని స్కూల్స్ బంద్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

India Pakistan Conflict : ఫిబ్రవరి 28వ తేదీన జరగాల్సిన ఎనిమిది, తొమ్మిది తరగతుల మ్యాథమేటిక్స్ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు సంబా జిల్లా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రకటించారు. పరిస్థితులు చక్కబడ్డాక పరీక్ష తేదీలు ప్రకటిస్తామని తెలిపారు.

ఇంకా చదవండి ...

    భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నియంత్రణ రేఖకు సమీపంలోని సరిహద్దు గ్రామాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాయి. పాకిస్తాన్ ఎప్పుడు ఎలాంటి దాడులకు పాల్పడుతుందో తెలియని పరిస్థితుల్లో.. సరిహద్దు గ్రామాల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విద్యా సంస్థలన్నింటికి సెలవులు ప్రకటించారు. ఇంటర్నేషనల్ బోర్డర్‌కు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న స్కూళ్లన్నింటినీ గురువారం కూడా మూసే ఉంచాలని ఆదేశాలు జారీ అయ్యాయి.


    ఫిబ్రవరి 28వ తేదీన జరగాల్సిన ఎనిమిది, తొమ్మిది తరగతుల మ్యాథమేటిక్స్ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు సంబా జిల్లా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రకటించారు. పరిస్థితులు చక్కబడ్డాక పరీక్ష తేదీలు ప్రకటిస్తామని తెలిపారు. అంతకుముందు గవర్నర్ సత్యపాల్ మాలిక్ జమ్మూకశ్మీర్‌లో శాంతి భద్రతలను సమీక్షించారు. కాగా, జైషే ఉగ్రవాద శిబిరాలపై దాడికి ప్రతిగా పాకిస్తాన్ భారత సైనిక స్థావరాలపై దాడికి యత్నించిందని భారత విదేశీ వ్యవహారాల ప్రతినిధి రవీష్ ధ్రువీకరించిన సంగతి తెలిసిందే. పాక్ దాడులపై అప్రమత్తంగా ఉన్న భారత వైమానిక దళం.. పాకిస్తాన్ యుద్ద విమానం మిగ్-21ను కూల్చేసినట్టు ఆయన తెలిపారు. అయితే భారత్‌కు చెందిన మిగ్-21 అనే విమానం మిస్ అయిందని, దాని పైలట్ అభినందన్ వర్థమాన్ పాకిస్తాన్‌‌కు పట్టుబడ్డారని తెలిపింది. ప్రస్తుతం ఆయన్ను సురక్షితంగా వెనక్కి తీసుకురావడంపై భారత్ దృష్టి సారించనుంది.    First published:

    Tags: Imran khan, India VS Pakistan, Jammu and Kashmir, Narendra modi, Pakistan, Pulwama Terror Attack

    ఉత్తమ కథలు