కరోనా కాలంలో ( Corona ) సెలవులకు అలవాటిని విద్యార్థులు.. గత కొద్ది రోజులుగా తిరిగి విద్యాసంస్థలకు చేరుకుంటున్నారు. అయితే సాధారణంగా ఎప్పుడు సెలవులు ఉంటాయా ఎప్పుడు బంక్ కొడతామా అనే ధోరణిలో ఉండే విద్యార్ధులు ఒక్కోసారి కాలేజీలకు ఎగనామం పెట్టడం సర్వసాధరణంగా మారుతోంది. అయితే కరోనా కాలంలో అలవాటు పడిన ఓ విద్యార్థి ఓమిక్రాన్ భయంతో కూడా కాలేజీ యాజమాన్యాలు సెలవులు ఇస్తాయని ఆశగా ఎదురు చూశాడు. అయితే ఎంతకి తాను ఆశించినట్టుగా తమ కాలేజికి మాత్రం సెలవులు ఇవ్వకపోవడంతో ఓ విద్యార్థి ఓ ప్లాన్ వేశాడు. ఒమిక్రాన్ భయాన్ని కాలేజీలో సృష్టిస్తే...భయపడి సెలవులు ఇస్తారని భావించాడు. దీంతో తోటి విద్యార్థినులను బలి చేశాడు. వాళ్లు తాగే నీళ్లలో విషం కలిపాడు.
వివరాల్లోకి ఒడిశాలోని ( Odisha ) బర్గార్ జిల్లాకు చెందిన కామగాన్ హయ్యర్ సెకండరీ స్కూల్ల్లో ఇంటర్ చదివే విద్యార్థి తన 20 మంది స్నేహితులకు బాటిల్ నీళ్లలో విషం కలిపి ఇచ్చాడు. ఆ బాటిల్లోని నీళ్లు తాగిన వారంతా వాంతులు, వికారంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేర్పించడంతో చికిత్స అనంతరం ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ సంఘటనపై ప్రిన్సిపాల్ ప్రేమానంద్ పటేల్ మాట్లాడుతూ.. ఒమిక్రాన్ ( Omicron ) కారణంగా మరోమారు లాక్డౌన్ విధించే ( Lockdown ) అవకాశం ఉందని నేరానికి పాల్పడిన విద్యార్ధి ఆశించాడని... అలా జరగకపోవడంతో ఈ పనికి పూనుకున్నాడని తెలిపాడు. ఐతే అనారోగ్యంపాలైన విద్యార్ధుల తల్లిదండ్రులు సదరు విద్యార్ధిని అరెస్ట్ ( Arrest ) చేయాలని డిమాండ్ చేశారు. కాగా ఆ విద్యార్థి కరోనా ఫస్ట్‌వేవ్‌తో పాటు సెకండ్ వేవ్‌లో కూడా విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారని ఇప్పుడు కూడా అలాగే ఆశించాడని తెలిపారు.
Hyderabad : అక్రమ నిర్మాణాలపై మరోసారి ఫోకస్.. 30లోగా గుర్తించి కూల్చి వేయండి...ప్రభుత్వ ఆదేశాలు..
ఈ క్రమంలోనే విద్యార్ధి కెరీర్‌తో పాటు వయసును దృష్టిలో ఉంచుకుని ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యలేదని ప్రిన్సిపల్ తెలిపారు.. కాని యాజమాన్యం మాత్రం ఆ విద్యార్థిపై చర్యలు తీసుకున్నారు. కొన్ని రోజులు ఆ విద్యార్థిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.