నిర్భయ కేసు: సుప్రీంకోర్టులో సొమ్మసిల్లి పడిపోయిన జడ్జి..

ఆర్డర్ కాపీ చదువుతూ జడ్జి ఆర్. భానుమతి సొమ్మసిల్లి పడిపోయారు. అప్రమత్తమైన కోర్టు సిబ్బంది ఆమెను హుటాహుటిన చాంబర్‌కు తీసుకెళ్లారు.

news18-telugu
Updated: February 14, 2020, 3:56 PM IST
నిర్భయ కేసు: సుప్రీంకోర్టులో సొమ్మసిల్లి పడిపోయిన జడ్జి..
సుప్రీంకోర్టు జడ్జి భానుమతి
  • Share this:
నిర్భయ కేసులో నలుగురు  దోషులకు ఉరిశిక్ష వాయిదా పడుతూనే ఉంది. న్యాయపరంగా ఉన్న అవకాశాలను ఒక్కొక్కరూ వేర్వేరుగా వినియోగించుకుంటున్న నేపథ్యంలో శిక్ష అమలు ఆలస్యమవుతోంది. ఈ క్రమంలో దోషులందరినీ ఒకేసారి ఉరితీయకుండా.. వేర్వేరుగా ఉరితీసేందుకు అవకాశం కల్పించాలని కేంద్రం వేసిన పటిషన్‌పై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఐతే ఈ సందర్భంగా ఆర్డర్ కాపీ చదువుతూ జడ్జి ఆర్. భానుమతి సొమ్మసిల్లి పడిపోయారు. అప్రమత్తమైన కోర్టు సిబ్బంది ఆమెను హుటాహుటిన చాంబర్‌కు తీసుకెళ్లారు. కొద్దిసేపటి తర్వాత భానుమతి తేరుకున్నప్పటికీ.. వీల్‌ఛైర్‌లో ఆస్పత్రికి తరలించారు.

ఇక కేంద్రం పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతానికి ఏ కోర్టులోనూ పెండింగ్ లేదన్న బెంచ్.. సోమవారం ట్రయల్ కోర్టు ఇచ్చే ఆర్డర్ కోసం వేచిచూస్తే బాగుంటుందని అభిప్రాయపడింది. అనంతరం కేసు విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఇఖ జస్టిస్‌ భానుమతి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని, ఐనప్పటికీ కేసు విచారణ నిమిత్తం కోర్టుకు వచ్చారని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తెలిపారు.

అంతకుముందు నిర్భయ దోషుల్లో ఒకరైన వినయ్‌ శర్మ పిటిషన్‌పై జస్టిస్‌ భానుమతి ధర్మాసం తీర్పు వెల్లడించింది. క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో వినయ్ పిటిషన్ దాఖలు చేశాడు. తన ఆరోగ్యం బాగోలేనందున క్షమాభిక్ష ప్రసాదించలని, కానీ రాష్ట్రపతి మాత్రం తిరస్కరించారంటూ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం..
వినయ్ దాఖలు చేసిన పిిటిషన్‌కు ఎలాంటి అర్హత కొట్టివేసింది. వినయ్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారంటూ మెడికల్ రిపోర్టులు చెబుతున్నాయని వెల్లడించింది. క్షమాభిక్ష తిరస్కరణపై న్యాక సమీక్ష కోరేందుకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఆ తర్వాత కాసేపటికే కేంద్రం అభ్యర్థనను విచారిస్తుండగా జస్టిస్‌ భానుమతి అస్వస్థతకు గురయ్యారు. నిర్భయ దోషుల డెత్ వారెంట్లపై పాటియాలా హౌజ్ కోర్టు సోమవారం తీర్పు వెల్లడించనుంది.


First published: February 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు