పాకిస్థాన్‌కు జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ స్ట్రాంగ్ వార్నింగ్...

పీవోకేలోని ఉగ్రవాద క్యాంపులను తప్పకుండా నాశనం చేస్తామని ఆయన హెచ్చరించారు. అలాగే పాక్ లోకి చొచ్చుకెళ్లి మరీ ఈ పని చేసివస్తామని సత్యపాల్ అన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాదుల శిక్షణా క్యాంపులను ఇలాగే కొనసాగిస్తే భవిష్యత్తులో మరిన్ని పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన అన్నారు.

news18-telugu
Updated: October 21, 2019, 4:51 PM IST
పాకిస్థాన్‌కు జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ స్ట్రాంగ్ వార్నింగ్...
జమ్మూకాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ (Image: News18 English)
  • Share this:
పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రవాద క్యాంపులే లక్ష్యంగా భారత్ సేన దాడులు జరిపి 24 గంటలైన గడవక ముందే జమ్మూకాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ పాక్ సేనలను ఉద్దేశించి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పీవోకేలోని ఉగ్రవాద క్యాంపులను తప్పకుండా నాశనం చేస్తామని ఆయన హెచ్చరించారు. అలాగే పాక్ లోకి చొచ్చుకెళ్లి మరీ ఈ పని చేసివస్తామని సత్యపాల్ అన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాదుల శిక్షణా క్యాంపులను ఇలాగే కొనసాగిస్తే భవిష్యత్తులో మరిన్ని పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే నీలం వ్యాలీలో పాకిస్థాన్ కాల్పుల ఉల్లంఘనలు జరిపిన నేపథ్యంలో భారత దళాలు ఆర్టిలరీ గన్స్ ద్వారా పీవోకేలోని ఉగ్రవాద శిక్షణా శిబిరాలను టార్గెట్ చేసుకొని కాల్పులు జరపడంతో 6-10 మంది పాక్ సైనికులతో పాటు పలువురు ఉగ్రవాదులు హతమైనట్లు భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ పేర్కొన్నారు.

గత కొన్ని రోజులుగా ఎల్ వోసీ వెంబడి సైనికులు, సామాన్యులే టార్గెట్‌గా పాకిస్థాన్ కాల్పులు జరుపుతోంది. ఇదిలా ఉంటే పాకిస్థాన్ విదేశీ వ్యవహారాల కార్యదర్శి మహ్మద్ ఫైజల్ ఇండియన్ ఆర్మీ ఎలాంటి దాడులు చేపట్టలేదని, అదంతా అవాస్తవమని ప్రకటించారు.

First published: October 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు