Sasikala Release: తొందరగా రిలీజ్ చేయండి.. శశికళ రిక్వెస్ట్

Sasikala Release: తనను జైలు నుంచి తొందరగా విడుదల చేయాలని కోరుతూ శశికళ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు.

news18-telugu
Updated: December 3, 2020, 9:33 AM IST
Sasikala Release: తొందరగా రిలీజ్ చేయండి.. శశికళ రిక్వెస్ట్
శశికళ (ఫైల్ ఫోటో)
  • Share this:
Sasikala Release: ప్రస్తుతం అక్రమ ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ ఎప్పుడు విడుదల అవుతారనే దానిపై తమిళనాడులో ఉత్కంఠ నెలకొంది. కోర్టు తీర్పు ప్రకారం, ఆమె శిక్ష పూర్తి చేసుకుని 2021 జనవరి 27న విడుదల కావాల్సి ఉంది. కోర్టు విధించిన రూ. 10 కోట్ల జరిమానా సైతం ఆమె చెల్లించారు. ఈ నేపథ్యంతో తనను త్వరగా విడుదల చేయాలని కోరుతూ శశికళ దరఖాస్తు చేసుకున్నారు. సత్ప్రవర్తన కారణంగా త్వరగా విడుదలయ్యే అవకాశాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

సత్ప్రవర్తన కారణంగా ప్రతి నెలా మూడు రోజులు శిక్షా కాలం నుంచి మినహాయిస్తారు. ఇప్పటికే 43 నెలల శిక్షా కాలాన్ని పూర్తి చేసుకున్న శశికళ 135 రోజుల సత్ప్రవర్తన దినాలను మినహాయిస్తే నిర్దేశిత సమయం కంటే ముందుగానే విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే శశికళ బెంగళూరు పరప్పన జైలు నుంచి విడుదలవుతారనే వార్తల నేపథ్యంలో కర్ణాటక హోంమంత్రి బసవరాజ్‌ కొద్దిరోజుల కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతి నిరోధక చట్టం కింద శిక్షకు గురైనవారు కోర్టు తీర్పు ప్రకారం పూర్తికాలం జైలు జీవితాన్ని అనుభవించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ నేరాలకు సత్ప్రవర్తన వర్తించదని మంత్రి బసవరాజ్ అన్నారు. ఈ ప్రకారం శశికళ నాలుగేళ్లు పూర్తిగా జైలు జీవితం గడపాలని.. ముందుగా విడుదలకు అవకాశాలు తక్కువని స్పష్టం చేశారు.

బసవరాజ్‌ వ్యాఖ్యలు ఎలా ఉన్నా.. శశికళ తనను ముందుగానే విడుదల చేయాలని దరఖాస్తు చేసుకోవడంతో.. ఆమె విషయంలో ఎలాంటి నిర్ణయం ఉంటుందనే అంశం ఆసక్తిగా మారింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.10 కోట్ల జరిమానాకు గురైన శశికళ 2017 ఫిబ్రవరి 15వ తేదీ నుంచి బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో కాలం గడుపుతున్నారు. ఇదే నేరంపై ఆమె బంధువులు ఇళవరసి, సుధాకరన్‌ సైతం అదే జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు.
Published by: Kishore Akkaladevi
First published: December 3, 2020, 7:15 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading