• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • SASIKALA RELEASE MAY FURTHER DELAYED EVEN AFTER PAYING 10 CRORE RUPEES FINE AK

Sasikala: శశికళకు మళ్లీ షాక్.. ఇప్పట్లో విడుదల లేనట్టే..

Sasikala: శశికళకు మళ్లీ షాక్.. ఇప్పట్లో విడుదల లేనట్టే..

శశికళ (ఫైల్ ఫోటో)

Sasikala Release: సాధ్యమైనంత తొందరగా శశికళ బెంగళూరు పరప్పన జైలు నుంచి విడుదలవుతారనే వార్తల నేపథ్యంలో కర్ణాటక హోంమంత్రి బసవరాజ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

  • Share this:
    అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ.. ఇప్పుడప్పుడే జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు లేవా ? కోర్టు విధించిన రూ. 10 కోట్ల జరిమానా చెల్లించినా.. ఆమె ముందుగా విడుదలయ్యే ఛాన్స్ లేనట్టేనా ? కర్ణాటక మంత్రి వ్యాఖ్యల తరువాత ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. సాధ్యమైనంత తొందరగా శశికళ బెంగళూరు పరప్పన జైలు నుంచి విడుదలవుతారనే వార్తల నేపథ్యంలో కర్ణాటక హోంమంత్రి బసవరాజ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతి నిరోధక చట్టం కింద శిక్షకు గురైనవారు కోర్టు తీర్పు ప్రకారం పూర్తికాలం జైలు జీవితాన్ని అనుభవించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.

    ఈ నేరాలకు సత్ప్రవర్తన వర్తించదని మంత్రి బసవరాజ్ అన్నారు. ఈ ప్రకారం శశికళ నాలుగేళ్లు పూర్తిగా జైలు జీవితం గడపాలి, ముందుగా విడుదలకు అవకాశాలు తక్కువని స్పష్టం చేశారు. బసవరాజ్‌ వ్యాఖ్యలతో శశికళ అభిమానులు డీలా పడిపోయారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.10 కోట్ల జరిమానాకు గురైన శశికళ 2017 ఫిబ్రవరి 15వ తేదీ నుంచి బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో కాలం గడుపుతున్నారు. ఇదే నేరంపై ఆమె బంధువులు ఇళవరసి, సుధాకరన్‌ సైతం అదే జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు. కోర్టు తీర్పు ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండోవారంలో నాలుగేళ్ల శిక్షాకాలం ముగుస్తుంది.

    అయితే కర్ణాటక ప్రభుత్వ విధివిధానాలను అనసరించి శశికళకు మొత్తం 129 రోజుల సెలవులనుగా విడుదల చేయాలని శశికళ తరఫు న్యాయవాది ఇటీవల బెంగళూరు జైలు సూపరింటెండెంట్‌కు వినతిపత్రం సమర్పించాడు. ఈనేపథ్యంలో చట్టాన్ని అనుసరించే శిక్షకాలం ఉంటుంది, ఇందులో రాజకీయ ప్రమేయానికి ఎంతమాత్రం చోటులేదని పేర్కొన్నారు. మరోవైపు ముందస్తు విడుదలకు అవకాశం లేదని కర్ణాటక మంత్రి స్పష్టం చేయడంతో బెంగళూరు కోర్టులో శుక్రవారం పిటిషన్‌ వేయాలని శశికళ న్యాయవాదులు నిర్ణయించారు. జరిమానా చెల్లింపు కూడా పూర్తయినందున శశికళను వెంటనే విడుదల చేయాలని కోరుతూ పిటిషన్‌ ధాఖలు చేయనున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు