Sardar Patel Death Anniversary: దేశానికి సర్దార్ పటేల్ చేసిన సేవలు అమోఘం

Sardar Patel Death Anniversary: దేశానికి సర్దార్ పటేల్ చేసిన సేవలు అమోఘం

Sardar Vallabhai Patel 70th Death Anniversary: ఇంత పెద్ద భారతదేశాన్ని ఏకతాటిపై నడిపించడం మామూలు విషయం కాదు. అందుకు ఎంతో గట్స్ కావాలి. సర్దార్ పటేల్ జీవితం మనకు ఆదర్శప్రాయం.

  • Share this:
Sardar Vallabhai Patel: స్వాతంత్ర్యం వచ్చాక భారతదేశానికి మొట్టమొదటి హోంమంత్రిగా సేవలందించిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ (Sardar Vallabhbhai Patel) వర్థంతి నేడు. పోరాటం ఆయన రక్తంలో ఉంది. విజయం ఆయన అడుగుల్లోనే ఉంది. బ్రిటీషర్లు భారత్‌ను విడిచి వెళ్లాక... దేశ రక్షణ, సమగ్రత కోసం ఆయన ఎంతో కృషి చేశారు. సర్దార్ పటేల్ అందరు నేతల్లా ఒకరి ఆదేశాల ప్రకారం నడుచుకునే వ్యక్తి కాదు. అందుకే ఆయనకు ఉక్కుమనిషి (‘Iron Man of India’) అనే గుర్తింపు వచ్చింది. వల్లభాయ్ పటేల్ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ముఖ్య నాయకుల్లో ఒకరు. 1875, అక్టోబర్ 31న జన్మించిన ఆయన... భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించారు. ఆయన ఒక న్యాయవాది. ముందు నుంచి మహాత్మాగాంధీ మద్దతుదారుడు. 1918లో గాంధీ అధ్వర్యంలో నిర్వహించిన ఖేదా సత్యాగ్రహం (Kheda Satyagraha) తరువాత వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. "సర్దార్ పటేల్ లేకపోయి ఉంటే... సత్యాగ్రహం విజయవంతమయ్యేది కాదేమో" అని గాంధీజీ సైతం ప్రశంసించారు. ఆ తరువాత గాంధీ నిర్వహించిన ఉద్యమాల్లో పటేల్ చురుకుగా పాల్గొన్నారు. నేడు ఆయన 70వ వర్థంతి సందర్భంగా... పటేల్ దేశానికి సేవలను ప్రజలు స్మరించుకుంటున్నారు.

* అలుపెరగని స్వాతంత్ర్య పోరాటం:
స్వాతంత్ర్య పోరాటం ఉద్ధృతం అవుతున్న దశలో పటేల్ న్యాయవాద వృత్తిని, ప్రాక్టీస్‌ను వదిలేశారు. తర్వాత ఉద్యమంలో క్రియాశీలకంగా మారారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. గ్రామాల్లో పర్యటించడం, సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలను స్వతంత్ర్య పోరాటంలో భాగం చేయడం, విదేశీ వస్త్రాలు, మద్యం అమ్మకాలను అడ్డుకోవడం వంటి కార్యక్రమాలు చేసేవారు. బ్రిటీష్ అధికారులు తీసుకువచ్చిన భూ సంస్కరణలకు వ్యతిరేకంగా ప్రారంభించిన బర్డోలి సత్యాగ్రహం (Bardoli Satyagraha)లో పటేల్ కీలకంగా వ్యవహరించారు. 1931 మార్చిలో నిర్వహించిన భారత జాతీయ కాంగ్రెస్ (Indian National Congress) 46వ సమావేశానికి పటేల్ అధ్యక్షత వహించారు. ఆ సమావేశాల్లోనే గాంధీ-ఇర్విన్ ఒప్పందాన్ని (Gandhi-lrwin Pact) ఆమోదించాలని నిర్ణయించారు. ఆ తరువాత ప్రాంతీయ శాసనసభలకు ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ స్థానాల్లో గెలుపొందింది. తర్వాత కాంగ్రెస్ పార్లమెంటరీ సబ్ కమిటీ ఛైర్మన్‌గా పనిచేసిన పటేల్... వివిధ మంత్రిత్వ శాఖలను పర్యవేక్షించారు.

ఇది కూడా చదవండి:Honey Beauty Tips: తేనెతో బ్యూటీ టిప్స్... పాటిస్తే మీకే లైక్స్...

* భరతమాతకు ప్రాణం పోశారు:
భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత పటేల్ ఉప ప్రధానమంత్రి (Deputy Prime Minister) అయ్యారు. దీంతోపాటు హోంశాఖ, స్టేట్స్, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ శాఖల (Home, States and the Information and Broadcasting portfolios) బాధ్యతలను ఆయనకు అప్పగించారు. అప్పట్లో రాజుల పాలనలో ఉండే కొన్ని రాష్ట్రాలు, ప్రాంతాలను దేశంలో కలిపేందుకు ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించి సమగ్ర భారతదేశానికి పటేల్ తుది రూపు ఇచ్చారు. సుమారు 550కి పైగా స్వతంత్ర్య రాజ్యాలను భారత్‌లో కలిపి ఐక్య భారత్ (‘Republic of India’) నిర్మాణానికి అలుపెరగని కృషి చేశారు. మాట వినని నిజాం రాజుపై పటేల్ ఉక్కుపాదం మోపారు. హైదరాబాద్‌పై సైనిక చర్య నిర్వహించి నిజాం పాలనకు అంతం పలికారు. బ్రిటీష్ హయాంలో మత కలహాలతో ఇబ్బందిపడిన భరతమాతకు శాంతిని తిరిగి తీసుకువచ్చారు. హోంమంత్రిగా శాంతిభద్రతలను పరిరక్షించి అసలైన లౌకిక దేశాన్ని పునర్నిర్మించారు. దేశానికి ఎన్నో విధాలుగా సేవలందించిన పటేల్... 1950వ సంవత్సరం డిసెంబర్ 15న తుది శ్వాస విడిచారు.
Published by:Krishna Kumar N
First published: