ఫుడ్ పాయిజన్.. హోటల్‌పై రూ.90లక్షల దావా

శరవణ భవన్‌లో భోజనం చేస్తే.. తనకు ఫుడ్ పాయిజన్ అయిందంటూ ఓ వ్యక్తి వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు.

news18-telugu
Updated: August 2, 2019, 4:05 PM IST
ఫుడ్ పాయిజన్.. హోటల్‌పై రూ.90లక్షల దావా
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తమిళనాడులో ప్రఖ్యాతి చెందిన శరవణ భవన్‌ హోటల్‌పై ఓ వ్యక్తి దావా వేశాడు. తనకు చెడిపోయిన ఆహారాన్ని వడ్డించినందుకు రూ.90లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే, సుదీర్ఘ విచారణ తర్వాత వినియోగదారుల ఫోరం.. ఆ వ్యక్తికి అనుకూలంగా తీర్పు చెప్పింది. అయితే, రూ.90లక్షలు కాకుండా రూ.లక్ష పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. 2014 అక్టోబర్‌లో ఓ వ్యక్తి చెన్నైలోని శరవణ భవన్‌లో భోజనం చేశాడు. అతడికి సర్వ్ చేసిన ఫుడ్‌లో వెంట్రుకలు కనిపించాయి. దీంతో బాధితుడు మేనేజ్‌మెంట్‌కు ఫిర్యాదు చేశాడు. ఆ వెంటనే ఆ ఆహారాన్ని మార్చిన యాజమాన్యం మరొకటి అందించింది. అది తిన్న కొన్ని గంటలకు ఆ వ్యక్తి కడుపులో గడబిడ మొదలైంది. వాంతులు, విరేచనాలు అయ్యాయి. ప్రభుత్వ ఆస్పత్రిలో ఐసీయూలో చేరాల్సి వచ్చింది. ఫుడ్ పాయిజన్ దెబ్బకు మానసికంగా కూడా దెబ్బతిన్నాడు. దీంతో శరవణభవన్ మీద దావా వేశాడు. తాను ఎదుర్కొన్న మానసిక సంక్షోభానికి రూ.90లక్షల పరిహారం ఇవ్వాలని వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. దీనిపై కోర్టు తీర్పు వెలువరించింది. బాధితుడికి పరిహారం కింద రూ.లక్ష ఇవ్వాలని ఆదేశించింది. దీంతో పాటు అతడికి కోర్టు ఖర్చుల కింద మరో రూ.10వేలు ఇవ్వాలని ఆదేశించింది.

First published: August 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>