Home /News /national /

SAPNA CHOUDHARY TERI AAKHYA KA YO KAJAL SONG FEMALE DELHI POLICE DANCE SB

సప్నా చౌదరి పాటకు స్టెప్పులేసిన ఢిల్లీ మహిళా పోలీసులు

సప్నా చౌదరి

సప్నా చౌదరి

ఓ కార్యక్రమంలో సప్నా పాటకు అదిరే స్టెప్పులేశారు ఢిల్లీ పోలీసులు.

    హర్యానాకు చెందిన ప్రముఖ డాన్సన్ సప్నా చౌదరి అంటే తెలియని వారుండరు. అయితే ఆమె డాన్స్ వేసే పాటల్లో ప్రముఖ పాట .. ‘తేరి ఆఖోంకా ఏ కాజల్ ’. ఈ పాట ఎంతగా ఫేమస్ అయ్యిందంటే... యూట్యూబ్‌లో ఈ సాంగ్‌ను ఇప్పటికే 380 మిలియన్ల మంది చూశారు. ఇప్పుడు ఇదే పాటకు ఢిల్లీ మహిళా పోలీసులు ఎంజాయ్ చేశారు. ఓ కార్యక్రమంలో సప్నా పాటకు అదిరే స్టెప్పులేశారు. దీంతో ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సప్నా చౌదరి పాటలకు ఎంతగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలుస్తోంది.

    సప్నా చౌదరికి హర్యానాలో మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండదు. చిన్న కుర్రాడి నుంచి 80 ఏళ్ల ముసలోడి వరకు అంతా ఆమె అభిమానులే . రాష్ట్రం మొత్తం తన ఆటపాటలతో అల్లాడించిన ప్రముఖ డాన్సర్ సప్నా చౌదరి. ఏఊరైనా సప్నా వస్తుందంటే... చాలు జనం పిచ్చెక్కిపోతారు. ఆమె స్టేజ్ షో కోసం పడిగాపులు కాస్తారు. సప్నా స్టెప్పులేస్తుంటే నోళ్లు తెరుచుకొని చూస్తుండిపోతారు.  సప్నా చౌదరి ..సెప్టెంబర్ 25, 1990లో హర్యానా రాష్ట్రం రోహ్‌తక్‌లో జన్మించింది. చిన్నతనం నుంచి కష్టాలు చూసి పెరిగింది. తండ్రి చిన్న కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. 12 ఏళ్ల వయస్సులోనే ఆమె తండ్రి చనిపోయాడు. దీంతో ఆమె కుటుంబం ఆర్థిక కష్టాల్లో పడిపోయింది. తన కుటుంబానికి అండగా ఉండేందుకు ... సప్నా చౌదరి డాన్స్‌నే తన జీవితంగా మలుచుకుంది. అప్పట్నుంచి ఊరువాడ తిరిగి స్టేజ్‌షోలు ఇవ్వడం ప్రారంభించింది.

    First published:

    Tags: Haryana, New Delhi, Police

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు