Santoor legend Shivkumar Sharma: సంతూర్ విద్వాసుడు పండిట్ శివకుమార్ శర్మ కన్నుమూత
సంతూర్ విద్వాంసుడు శివ కుమార్ శర్మ (పాత ఫొటో)
సుప్రసిద్ధ సంతూర్ విద్వాంసుడు, సంగీతకారుడు పండిట్ శివకుమార్ శర్మ ఇక లేరు. 84ఏళ్ల సంతూర్ మెస్ట్రో ముంబైలో మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయనకు గుండె పోటు రావడంతో మరణించారు.
ధృవతారలా నిలిచిన మరో కళాకారుణ్ని భారతజాతి కోల్పోయింది. సుప్రసిద్ధ సంతూర్ విద్వాంసుడు, సంగీతకారుడు పండిట్ శివకుమార్ శర్మ ఇక లేరు. 84ఏళ్ల సంతూర్ మెస్ట్రో ముంబైలో మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయనకు గుండె పోటు రావడంతో ఆకస్మికంగా మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. పండిట్ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర జాతీయ నేతలు, సంగీతాభిమానులు సంతాపం తెలిపారు.
సంతూర్ వాయిద్యంతో ప్రపంచాన్ని ఓలలాడించిన పండిట్ శివకుమార్ శర్మ అత్యంత సుప్రసిద్ధులైన సంప్రదాయ సంగీతకారుల్లో ఒకరు. 84 ఏళ్ల వయసులోనూ నిత్యం సాధన చేసే పండిట్.. వచ్చే వారం భోపాల్లో ప్రదర్శన ఇవ్వవలసి ఉండగా అనూహ్య రీతిలో హఠాన్మరణం చెందారు. నిత్యం డయాలసిస్ జరుగుతూ ఉన్నా చాలా చురుగ్గా ఉండేవారని, వచ్చే వారంలో జరగాల్సిన భోపాల్ ప్రదర్శనకు సిద్ధమవుతున్నారని అంతలోనే ఇవాళ ఉదయం తీవ్రమైన గుండెపోటు వచ్చిందని కుటుంబీకులు తెలిపారు.
పండిట్ శివకుమార్ శర్మ (పాత ఫొటో)
CM KCR | Centre: కేసీఆర్ సర్కారుకు భారీ షాక్.. అప్పులు నిలిపేసిన కేంద్రం.. సంక్షేమ పథకాలకు దెబ్బ!
పండిట్ శివకుమార్ శర్మ 1938లో కాశ్మీర్ లో జన్మించారు. జమ్మూ-కశ్మీరులోని జానపద వాద్య పరికరం సంతూర్ను ఉపయోగించి భారతీయ సంప్రదాయ సంగీతాన్ని వినిపించిన మొట్టమొదటి సంగీతకారుడు ఆయనే కావడం విశేషం. పలు బాలీవుడ్ సినిమాలకు సైతం ఆయన సంగీత దర్శకత్వం వహించారు. సుప్రసిద్ధ వేణు నాద సంగీతకారుడు పండిట్ హరి ప్రసాద్ చౌరాసియాతో కలిసి ‘సిల్సిలా’, ‘లమ్హే’ , ‘చాందిని’ వంటి సినిమాలకు సంగీతాన్ని సమకూర్చారు. పండిట్ శివ కుమార్ తనయుడు రాహుల్ శర్మ కూడా సంతూర్ వాద్యకారుడే. సంగీతరంగంలో పండిట్ శివ కుమార్ శర్మ సేవలకుగానూ భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో ఆయనను సత్కరించింది.
Our cultural world is poorer with the demise of Pandit Shivkumar Sharma Ji. He popularised the Santoor at a global level. His music will continue to enthral the coming generations. I fondly remember my interactions with him. Condolences to his family and admirers. Om Shanti.
పండిట్ మరణంపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. ‘పండిట్ శివకుమార్ శర్మ మరణంతో మన సాంస్కృతిక ప్రపంచం మరింత దీనురాలైపోయింది. సంతూర్కు ప్రపంచ స్థాయిలో ప్రాచుర్యం కల్పించారాయన. రాబోయే తరాలను కూడా ఆయన సంగీతం ఉర్రూతలూగిస్తూనే ఉంటుంది. ఆయనతో నాకున్న ప్రేమానుబంధాన్ని మరువలేను. పండిట్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా సానుభూతి. ఓం శాంతి.’అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.