Sanjeevani Gaadi: నెట్‌వర్క్18, ఫెడరల్ బ్యాంక్ సంజీవని గాడీ.. కరోనాపై అవిశ్రాంత పోరు

Sanjeevani Gaadi: నెట్‌వర్క్18, ఫెడరల్ బ్యాంక్ సంజీవని గాడీ.. కరోనాపై అవిశ్రాంత పోరు (image credit - facebook)

Sanjeevani Gaadi: దేశ ప్రజల్లో కరోనాపై అవగాహన కలిగించడం అత్యంత ముఖ్యం. అవగాహన ఉన్నవారు కరోనా రాకుండా తప్పించుకోగలరు. అందుకు సంజీవని గాడీ పేరుతో... నెట్‌వర్క్18, ఫెడరల్ బ్యాంక్ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాయి.

  • Share this:
    Sanjeevani Gaadi: ఇండియాలో కరోనాను తరిమేసేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా... ఫెడరల్ బ్యాంక్ సహకారంతో... నెట్‌వర్క్18 చేపట్టిన బృహత్తర కార్యక్రమమే సంజీవని - ఏ షాట్ ఆఫ్ లైఫ్. ఇందులో భాగంగా గ్రామస్థాయి వరకూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సంజీవని వాహనాలు... క్షేత్రస్థాయికి వెళ్తూ... ప్రజల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. ఇండియాలో కరోనా ఎక్కువగా సోకిన 5 జిల్లాల్లో ఈ సంజీవని బండ్లు అవగాహనా కార్యక్రమాలు చేపట్టనున్నాయి. కరోనాపై ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేయడం వీటి ప్రధాన ఉద్దేశం. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నాడు బాలీవుడ్ నటుడు, ఈ కార్యక్రమ ప్రచార కర్త సోనూసూద్... ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

    ఈ సంజీవని బండ్లు... మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, పంజాబ్‌లోని అమృత్‌సర్, కర్ణాటకలోని దక్షిణ కన్నడ, మహారాష్ట్రలోని నాశిక్, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించబోతున్నాయి. ఇందులో భాగంగా ఇవి అమృత్‌సర్‌లో 70 గ్రామాలు, ఇండోర్, దక్షిణ కన్నడ జిల్లాల్లోని 100 గ్రామాల్లో ప్రజలకు ఇవాళ్టి నుంచి అవగాహన కల్పించనున్నాయి. త్వరలోనే ఇవి నాశిక్, గుంటూరు జిల్లాలకు కూడా వెళ్లబోతున్నాయి.

    ఈ వాహనాలు... 5 జిల్లాల్లోని మొత్తం 500 గ్రామాలను కవర్ చేస్తాయి. అక్కడి ప్రజలకు కరోనా అంటే ఏంటి.. అది ఎలా సోకుతుంది... అది సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాక్సిన్ ఎలా పొందాలి, వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి... ఇలా కరోనాకి సంబంధించి పూర్తి అవగాహన కల్పించనున్నాయి. అలాగే... గ్రామాల్లో ప్రజలు కరోనా జాగ్రత్తలు తీసుకునేలా అన్ని విషయాలూ విపులంగా వివరించనున్నాయి. అలాగే... ఈ ఐదు జిల్లాల్లో త్వరలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా చేపట్టనున్నారు. ఇందుకు అపోలో 24*7, యునైటెడ్ వే ముంబై అనే స్వచ్ఛంద సంస్థ ఆరోగ్య భాగస్వాములు (health partner)గా ఉండనున్నాయి.


    నెట్‌వర్క్ 18, ఫెడరల్ బ్యాంక్ సహకారంతో... సంజీవని - ఏ షాట్ ఆఫ్ లైఫ్ కార్యక్రమాన్ని పంజాబ్... అమృత్‌సర్‌లోని... అత్తారీ సరిహద్దు దగ్గర ఈ ఏడాది ఏప్రిల్ 7న ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి సోనూసూద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

    ఇది కూడా చదవండి: Diabetes Control: డయాబెటిస్‌ సమస్యకి వేప ఆకులతో చెక్... ఇలా చెయ్యండి

    ప్రస్తుతం ఇండియాలో కరోనా చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఇలాంటి సమయంలో ప్రజల్లో ఎంతలా అవగాహన పెరిగితే... అంతలా వ్యాధిని కంట్రోల్ చెయ్యవచ్చు. ముఖ్యంగా సెకండ్‌వేవ్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా ఇండియాపై ప్రభావం పడింది. రోజువారీ ప్రపంచ కరోనా కేసుల్లో 40 శాతం ఇండియాలో వస్తున్నాయి. ప్రస్తుతం లాక్‌డౌన్ల కారణంగా... రెండు వారాలుగా కేసులు తగ్గుతున్నా... ఇప్పటికీ రోజూ 4వేలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. అందువల్ల వీలైనంత జోరుగా వ్యాక్సినేషన్ కార్యక్రమం సాగాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి.
    Published by:Krishna Kumar N
    First published: