Sanjay Raut BIG revelation : మహారాష్ట్ర(Maharashtra)సంక్షోభం ముగిసినా వాటి ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తాజాగా శివసేన ఎంపీ,మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే ప్రధాన అనుచరుడు సంజయ్ రౌత్(Sanjay Raut)సంచలన నిజాన్ని బయటపెట్టారు. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో తిరుగుబాటు కారణంగా మహారాష్ట్రలో ఉద్దవ్ సర్కార్ కూలిపోయి షిండే సీఎం అయిన కొద్ది రోజులకే శివసేన నాయకుడు సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చనీయాంశనీయంగా మారాయి. జూన్ 29న, ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు మరియు మరుసటి రోజు, ఏక్నాథ్ షిండే రాష్ట్ర సీఎం పదవిని చేపట్టారు.
అయితే షిండే సీఎం పదవి చేపట్టడానికి ముందే..అసోంలోని గౌహతిలో ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని రెబెల్ గ్రూపులోకి రావాలని తనకు కూడా ఆఫర్ వచ్చిందని సంజయ్ రౌత్ తెలిపారు. తాను బాలాసాహెబ్ ఠాక్రే అనుయాయుడని చెబుతూ ఆ ప్రతిపాదనను తోసిపుచ్చానని చెప్పారు. రూ.1,034 కోట్ల విలువైన పత్రా చాల్ భూ కుంభకోణం కేసులో ఈడీ విచారణకు హాజరైన అనంతరం రౌత్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని అందుకే తాను ఈడీ ఎదుట ఆత్మవిశ్వాసంతో విచారణకు హాజరయ్యానని రౌత్ పేర్కొన్నారు. పది గంటల విచారణ అనంతరం తిరిగి బయటకు వచ్చానని చెప్పారు. మన వైపు నిజం ఉన్నప్పుడు బయపడాల్సిన అవసరం ఏముందన్నారు. శివసేన ఉద్ధవ్ ఠాక్రేతోనే ఉందని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ఏక్నాథ్ షిండే శివసేన సీఎం కాదని ఉద్ధవ్ ఠాక్రే స్పష్టంగా చెప్పారని అన్నారు. ముంబైలో శివసేన ఉనికిని తగ్గించేందుకే తమ పార్టీని దెబ్బతీయాలని కాషాయ పార్టీ వ్యూహంలో భాగంగా ఇదంతా జరిగిందని షిండే తిరుగుబాటును ఉద్దేశించి రౌత్ అన్నారు. శుక్రవారం జరిగిన శివసేన ఎంపీల సమావేశానికి 18 మంది ఎంపీలకు గాను 15 మంది హాజరయ్యారని చెప్పారు. నిజమైన శివసైనికులు ఎవరూ ప్రలోభాలకు లోనుకారని, ఉద్ధవ్ ఠాక్రేదే నిజమైన శివసేనని స్పష్టం చేశారు.
మరోవైపు,నాటకీయ పరిణామాల మధ్య గురువారం శివసేన(Shiv Sena) రెబల్ నేత ఏక్నాథ్ షిండే(Eknath Shinde)బీజేపీ మద్దతుతో మహారాష్ట్ర సీఎంగా(Maharashtra CM) ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. సోమవారం(జులై-4) అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోవడానికి షిండే రెడీ అవుతున్నారు. జులై 2 నుంచి రెండు రోజుల పాటు మహారాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సమావేశాలు ప్రారంభమైన తొలిరోజున అసెంబ్లీ స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. జులై 4 సోమవారం రోజు షిండే బలనిరూపణ చేసుకోకున్నారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.