Home /News /national /

SANJAY RAUT ARREST COURT REMANDS SENA MP TO ED CUSTODY TILL AUG 4 HOME MADE FOOD MEETING WITH LAWYER ALLOWED SK

Sanjay Raut Arrest: సంజయ్ రౌత్‌కు 4 రోజుల ఈడీ కస్టడీ.. ఇంటి భోజనానికి అనుమతి

సంజయ్ రౌత్

సంజయ్ రౌత్

Sanjay Raut: సంజయ్ రౌత్‌కి ఇంటి నుంచి భోజనం తీసుకొచ్చేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. కస్టడీలో ఆయన్ను లాయర్‌ కలిసే వెసులుబాటును కూడా కల్పించింది. సంజయ్ రౌత్‌ను ప్రశ్నించే సమయంలో లాయర్ అక్కడే ఉండవచ్చు. ఐతే ఈడీ వేసే ప్రశ్నలు, సంజయ్ రౌత్ చెప్పే సమాధానాలు మాత్రం వినిపించకూడదని స్పష్టం చేసింది.

ఇంకా చదవండి ...
    మనీలాండరింగ్ (Money Laundering) కేసులో అరెస్టయిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌ను (Sanjay Raut) ముంబైలోని ప్రత్యేక కోర్టు ఆగస్టు 4 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) కస్టడీకి పంపింది. సంజయ్ రౌత్‌ను ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ) కోర్టులో హాజరుపరిచి ఎనిమిది రోజుల కస్టడీని ఈడీ కోరింది. ఈడీ తరపున హాజరైన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హితేన్ వెనెగావ్కర్. రౌత్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు అక్రమ మార్గాల్లో డబ్బును సంపాదించారని కోర్టుకు తెలిపారు.  ఈడీ ఎనిమిది రోజుల కస్టడీ కోరగా.. PMLA జడ్జి ఎంజీ దేశ్‌పాండే నాలుగు రోజుల కస్టడీ విధించారు.

    ఐతే సంజయ్ రౌత్‌కి ఇంటి నుంచి భోజనం తీసుకొచ్చేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. కస్టడీలో ఆయన్ను లాయర్‌ కలిసే వెసులుబాటును కూడా కల్పించింది. సంజయ్ రౌత్‌ను ప్రశ్నించే సమయంలో లాయర్ అక్కడే ఉండవచ్చు. ఐతే ఈడీ వేసే ప్రశ్నలు, సంజయ్ రౌత్ చెప్పే సమాధానాలు మాత్రం వినిపించకూడదని స్పష్టం చేసింది. ఇక కోర్టులో సంజయ్ రౌత్ తరపున సీనియర్ న్యాయవాది అశోక్ ముందర్గి వాదించారు. ఆయనపై ఈడీ చేసిన ఆరోపణలు అస్పష్టంగా ఉన్నాయని... ఇవన్నీ రాజకీయ కక్ష సాధింపుతో చేసినవని ఆరోపించారు. ఐతే ఆయన వాదలను కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. అనంతరం సంజయ్ రౌత్‌ని నాలుగు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది.





    ముంబైలోని 'చాల్' రీడెవలప్‌మెంట్‌లో అవకతవకలు జరిగినట్లు ఈడీ గుర్తించిన విషయం తెలిసిందే. 'పత్రా చాల్' భూ కుంభకోణంలో సంజయ్ రౌత్‌తో పాటు ఆయన భార్య, అనుచరుల లావాదేవీలకు సంబంధించి మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఏప్రిల్ వర్షా రౌత్‌కు సంబంధించిన 11.50 కోట్లు విలువ చేసే ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అనంతరం సంజయ్ రౌత్‌ను కూడా విచారణకు పిలిచింది. జూలై 1న ముంబైలోని ఈడీ కార్యాలయంలో ఆయనకు విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత మరో రెండుసార్లు నోటీసులు ఇచ్చారు. కానీ పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయని చెప్పి ఆయన హాజరుకాలేదు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం ముంబైలోని సంజయ్ రౌత్ నివాసంలో సోదాలు చేసిన ఈడీ.. అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకుంది. మనీలాండరింగ్ కేసులో ఆయన్ను అరెస్ట్ చేసినట్లు ఆదివారం అర్ధరాత్రి ప్రకటించింది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Maharashtra, Mumbai, Sanjay Raut

    తదుపరి వార్తలు