బీజేపీలో చేరిన స్మగ్లర్ వీరప్పన్ కుమార్తె విద్యారాణి...

తమిళనాడులోని కృష్ణగిరిలో బీజేపీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో విద్యారాణి కాషాయ కండువా కప్పుకొన్నారు.

news18-telugu
Updated: February 23, 2020, 2:23 PM IST
బీజేపీలో చేరిన స్మగ్లర్ వీరప్పన్ కుమార్తె విద్యారాణి...
మురళీధర్ రావు సమక్షంలో బీజేపీలో చేరిన వీరప్పన్ కుమార్తె విద్యారాణి
  • Share this:
చందనం స్మగ్లర్ వీరప్పన్ కుమార్తె విద్యారాణి బీజేపీలో చేరారు. తమిళనాడులోని కృష్ణగిరిలో బీజేపీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో విద్యారాణి కాషాయ కండువా కప్పుకొన్నారు. భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ మురళీధర్ రావు, కేంద్ర మాజీ మంత్రి పొన్ రాధాకృష్ణన్ సమక్షంలో ఆమె పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మురళీధర్ రావు ఆమెకు పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు. ‘కులమతాలతో సంబంధం లేకుండా పేదల అభ్యున్నతి కోసం పనిచేయాలనుకుంటున్నా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకొచ్చిన పథకాలను పేదల వద్దకు తీసుకెళ్లడమే నా లక్ష్యం.’ అని విద్యారాణి తెలిపారు. విద్యారాణితోపాటు సుమారు 1000 మంది వివిధ పార్టీల కార్యకర్తలు బీజేపీలో చేరారు.

కూసే మునిస్వామి వీరప్పన్ గౌండర్ అలియాస్ వీరప్పన్ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను వణికించాడు. చందనం కలప స్మగ్లింగ్‌తో ప్రారంభమైన వ్యవహారం సినీ ప్రముఖులను కిడ్నాప్ చేసే వరకు వెళ్లింది. కొందరు పోలీసులు కూడా వీరప్పన్ చేతిలో ప్రాణాలు కోల్పోయారు.

వీరప్పన్, అతని అనుచరుల్ని పట్టుకునేందుకు తమిళనాడు పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆపరేషన్ కుకూన్ పేరుతో ప్రణాళికను రచించింది. ఈ ఆపరేషన్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ విజయకుమార్ నాయకత్వంలో సాగింది. 1991లో ఆరంభమైన ఈ ఆపరేషన్ 2004 అక్టోబర్ 18న వీరప్పన్, అతని అనుచరులు సేతుకాళి గోవిందన్, చంద్రె గౌడ, సేతుమునిలను కాల్చిచంపడంతో ముగిసింది. ఇది దాదాపు రూ.100 కోట్ల ఖర్చుతో భారతదేశ చరిత్రలోకెల్లా అత్యంత ఖర్చు అయిన ఆపరేషన్ గా నిలిచింది.

వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి మైసూర్ జైల్లోఉంది. జామీనుపై విడుదలకు సహకరించాల్సిందిగా వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి వేడుకుంది. ఎప్పుడో నా భర్త చేశాడని చెబుతున్న నేరానికి తనను అక్రమంగా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. అప్పట్లోనే తనను అరెస్టు చేసి ఉంటే ఈ పాటికి శిక్షాకాలం కూడా పూర్తయి ఉండేదని చెప్పింది. వీరప్పన్‌, ముత్తులక్ష్మి దంపతులకు ముగ్గురు పిల్లలు. అందులో ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు.

First published: February 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు