same sex couple : అన్ని హద్దులు దాటి అందరిముందే అలా.. చివరికిలా..

నిజానికి తామిద్దరం హద్దులు మీరి ఏమీ ప్రవర్తించలేదని.. అలాంటప్పుడు హోటల్‌కు వచ్చిన ఇతర గెస్టులు తమపై అలాంటి ఫిర్యాదు ఎందుకు చేశారని గోపాలక‌ృష్ణన్ అన్నారు.

news18-telugu
Updated: August 2, 2019, 9:25 AM IST
same sex couple : అన్ని హద్దులు దాటి అందరిముందే అలా.. చివరికిలా..
స్వలింగ సంపర్కులు
news18-telugu
Updated: August 2, 2019, 9:25 AM IST
చెన్నైలోని ఓ హోటల్ యాజమాన్యం ఓ స్వలింగ సంపర్క జంటను హోటల్ నుంచి బయటకు గెంటివేసింది. అందరూ చూస్తుండగానే హద్దులు మీరి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారన్న కారణంగా వారిని బయటకు నెట్టివేసినట్టు యాజమాన్యం తెలిపింది.అయితే తామేమీ అసభ్యంగా ప్రవర్తించలేదని.. హోటల్ యాజమాన్యం తమ పట్ల దారుణంగా వ్యవహరించిందని ఆ జంట మండిపడింది.
వివరాల్లోకి వెళ్తే.. రసిక గోపాలకృష్ణన్,శివంగి సింగ్ అనే ఇద్దరు యువతులు జులై 28వ తేదీ శనివారం రాత్రి చెన్నైలోని ఓ హోటల్‌కు వెళ్లారు. అక్కడి బార్‌లో యువతులు ఇద్దరు డ్యాన్స్ చేస్తుండగా.. నలుగురైదుగురు పురుషులు వారినే చూస్తుండిపోయారు. అది తమకు చాలా ఇబ్బందికరంగా అనిపించిందని గోపాలకృష్ణన్ ఫేస్‌బుక్ పోస్టులో వెల్లడించారు.అందరి లాగే అక్కడ తామూ ఎంజాయ్ చేశామని.. కానీ అంతా తమవైపే అదో రకంగా ఎందుకు చూస్తున్నారో అర్థం కాలేదన్నారు. స్వలింగ వ్యక్తులు ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తే వారెందుకు తట్టుకోలేకపోయారో అర్థంకాలేదన్నారు. వాళ్లు తమ పట్ల వ్యవహరించిన తీరు దారుణంగా ఉందని మండిపడ్డారు.

ఆ తర్వాత కొద్దిసేపటికి తాము ఇద్దరం కలిసి వాష్‌రూమ్‌లోకి వెళ్లినట్టు గోపాలకృష్ణన్ తెలిపారు. కాసేపటికే తాము వెళ్లిన వాష్‌రూమ్ డోర్‌ను బయటినుంచి ఎవరో కొట్టారని చెప్పారు. నలుగురు మగ బౌన్సర్లు, ఒక లేడీ బౌన్సర్ వాష్‌రూమ్ తలుపుపై బాదుతూ తమను బయటకు రావాల్సిందిగా డిమాండ్ చేశారని అన్నారు. ఇద్దరు కలిసి వాష్‌రూమ్‌లో ఏం చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారన్నారన్నారు. లోపల మేమేదో చేయకూడనిది చేస్తున్నామని వారు భావించినట్టుగా చెప్పారు. హోటల్‌కు వచ్చిన చాలామంది మా ప్రవర్తనపై ఫిర్యాదు చేసినట్టుగా బౌన్సర్స్ చెప్పారని.. దాంతో ఇక తాము వాష్‌రూమ్ నుంచి బయటకు వచ్చేశామని తెలిపారు.

నిజానికి తామిద్దరం హద్దులు మీరి ఏమీ ప్రవర్తించలేదని.. అలాంటప్పుడు హోటల్‌కు వచ్చిన ఇతర గెస్టులు తమపై అలాంటి ఫిర్యాదు ఎందుకు చేశారని గోపాలక‌ృష్ణన్ అన్నారు. కనీస మర్యాద లేకుండా తమను హోటల్‌ నుంచి గెంటేయడం ఆశ్చర్యమనిపించిందన్నారు.హోటల్‌లో తామిద్దరం హద్దులు మీరి ప్రవర్తించామని.. ఆ వీడియో వారి వద్ద ఉందని హోటల్ యాజమాన్యం చెప్పిందన్నారు. అదే నిజమైతే ఆ వీడియో బయటపెట్టాలని డిమాండ్ చేశామని.. దాంతో బయటపెట్టాల్సిన అవసరం లేదని వారు బుకాయిస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడ ఎలా ఉండాలో తమకు తెలుసని.. లేనిపోని అబద్దాలు చెప్పి తమను బయటకు గెంటేయడం అన్యాయం అని అన్నారు.మరోవైపు హోటల్ యాజమాన్యం మాత్రం.. హోటల్‌కు వచ్చిన గెస్ట్‌లను గౌరవించడం తమ బాధ్యత అని.. ఆ జంట వల్ల ఎక్కువమంది ఇబ్బందిపడ్డారు కాబట్టే వారిని బయటకు పంపించామని చెబుతున్నారు.

First published: August 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...