ఒడిశాలో రైలు ప్రమాదం.. ముగ్గురు రైల్వే ఉద్యోగులు మృతి

ఇద్దరు మృతిచెందడంతో పాటు పలువురు గాయాలపాలైనట్లు సమాచారం. ఒకే లైన్‌పై ఎక్స్‌ప్రెస్ రైలుతో పాటు.. టవర్ కారు కూడా రావడమే ప్రమాదానికి కారణమని అధికారులు చెబుతున్నారు.

news18-telugu
Updated: June 26, 2019, 9:04 AM IST
ఒడిశాలో రైలు ప్రమాదం.. ముగ్గురు రైల్వే ఉద్యోగులు మృతి
ఒడిశాలో రైలు ప్రమాదం. ముగ్గురు మృతి
  • Share this:
ఒడిశాలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. హౌరా టు జగదల్‌పూర్ వెళ్లే సమాలేశ్వర్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న టవర్ కార్‌ను ఢీకొనడంతో ఇంజిన్లో మంటలు చెలరేగాయి. దీంతో ముగ్గురు ఈ ప్రమాదంలో మృతిచెందినట్లుగా తెలుస్తోంది. మృతిచెందిన వారు రైల్వే ఉద్యోగులుగా గుర్తించారు. మృతులను సీనియర్ సెక్షన్ ఇంజినీర్ సాగర్‌తో పాటు.. టవర్ కార్ టెక్నీషియన్స్ గౌరునాయుడు, సురేష్‌‌గా గుర్తించారు ఉన్నారు.  మంగళవారం తెల్లవారుజామున రాయగడ జిల్లా సింగాపూర్-కె అవుట్ గుడ మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో రెండు జనరల్ బోగీలతో పాటు.. లగేజ్ బోగీల్లో కూడా మంటలు వ్యాపించాయి. మరికొందరు గాయాలపాలైనట్లు సమాచారం.

ఒకే లైన్‌పై ఎక్స్‌ప్రెస్ రైలుతో పాటు.. టవర్ కారు కూడా రావడమే ప్రమాదానికి కారణమని అధికారులు చెబుతున్నారు. అయితే రైల్వే అధికారుల మధ్య సమన్వయ లోపం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ట్రైన్ వస్తున్న సమాచారం టవర్ కార్ సిబ్బందికి తెలియకపోవడంతో.. వాళ్లు కూడా అదే ట్రాక్‌పై మరమ్మతుల నిమిత్తం పనిచేస్తున్నారు. దీంతో ఎటువంటి సమాచారం లేకుండా ఎదురెదురుగా రెండు రావడంతో ఢీకొని ప్రమాదం జరిగిటనట్లు తెలుస్తోంది.First published: June 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు