Home /News /national /

SAMAJWADI PARTY CHIEF MULAYAM SINGH YADAV 2ND WIFE SADHNA GUPTA PASSESWAY FUNERAL AT PIPRAGHAT LUCKNOW TODAY MKS

Mulayam Wife Death: ములాయం భార్య సాధన గుప్తా పార్థివదేహం లక్నోకు.. నేడు అంత్యక్రియలు

ములాయం సింగ్ యాదవ్, సాధన గుప్తా (పాత ఫొటోలు)

ములాయం సింగ్ యాదవ్, సాధన గుప్తా (పాత ఫొటోలు)

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధన గుప్తా మృతదేహాన్ని శనివారం అర్థరాత్రి లక్నోకు తరలించారు. పిప్రా ఘాట్ లో ఆదివారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహిస్తారు. వివరాలివే..

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ (Mulayam singh yadav) రెండో భార్య సాధన గుప్తా (Sadhana Gupta) మృతదేహాన్ని శనివారం అర్థరాత్రి లక్నోకు తరలించారు. అభిమానులు, బంధువులు, పార్టీ శ్రేణుల సందర్శనార్థం ఆమె భౌతికకాయాన్ని ములాయం నివాసంలో ఉంచారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు పిప్రాఘాట్‌లో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ సమాచారాన్ని ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్ వెల్లడించారు.

ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ భార్య సాధన గుప్తా శనివారం గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. 65 ఏళ్ల సాధన గుప్తా 2020 నుంచి కరోనా అనంతర ఇబ్బందులతో బాధపడుతున్నారు. కరోనా సమయంలో ఆమెకు ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ సోకింది. కొన్నాళ్లు కోలుకున్నట్లు అనిపించినా, మళ్లీ ఇబ్బందులు తలెత్తడంతో ఆమెను ఆస్పత్రిలోనే ఉంచి చికిత్స అందించారు. చివరికి శనివారం మధ్యాహ్నం ఆమె కన్నుమూశారు.


Heavy Rains : జులైలో 10ఏళ్ల రికార్డు బద్దలు.. మరో 2రోజులు భారీ వర్షాలు.. బయటికి రావొద్దన్న CM KCR


సాధన గుప్తా మృతితో యాదవ పరివారంలో విషాదఛాయలు అలముకున్నాయి. ములాయం సతీమణి మృతి పట్ల ఎస్పీ సహా విపక్ష నేతలు సంతాపం తెలిపారు. యూపీ యాదవ పరివారానికి దగ్గరి బంధువులైన బీహార్ యాదవ పరివారం ముఖ్యుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం కూడా ఇటీవల విషమించడం తెలిసిందే.


Union Cabinet : కేంద్ర కేబినెట్‌లో మార్పులు.. తెలంగాణకు మరో బెర్త్.. జగన్ వైసీపీకీ అహ్వానం?


ములాయం మొదటి భార్య మాలతీ దేవి 2003లో చనిపోయాక.. అదే ఏడాది ఆయన సాధనను వివాహం చేసుకున్నారు. సాధనా గుప్తా ములాయం కంటే 20 ఏళ్లు చిన్నవారు. ఆమె కుమారుడు ప్రతీక్ యాదవ్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు. ఆయన భార్య అపర్ణా యాదవ్ బీజేపీలో కొనసాగుతున్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అపర్ణ కాషాయ పార్టీ గూటికి చేరారు. సాధన మృతి పట్ల ఉత్తర ప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య సంతాపం తెలిపారు. అఖిలేష్ యాదవ్ ములాయం మొదటి భార్య కుమారుడు.
Published by:Madhu Kota
First published:

Tags: Akhilesh Yadav, Samajwadi Party, Uttar pradesh

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు