యూపీ ఎన్నికల ర్యాలీలో అఖిలేష్ యాదవ్ (photo: samajwadiparty/Twitter)
Uttar Pradesh: కర్హల్ నియోజకవర్గంలో ఎస్పీ ఎప్పటి నుంచో స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తోంది. 2007, 2012, 2017లో వరుసగా మూడు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ విజయం సాధించింది.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి దశ ఓటింగ్‌కు తేదీ దగ్గర పడుతోంది. అన్ని పార్టీలు కూడా తమ అభ్యర్థులను ఖరారు చేస్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ మాత్రం యూపీలోని ఆ సీటును.. సీఎం అభ్యర్థిగా ఉన్న పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అక్కడి నుంచి ఎన్నికల్లో పోటీ చేయవచ్చని సూచించింది. అఖిలేష్ యాదవ్ మెయిన్‌పురిలోని కర్హాల్ స్థానం నుండి పోటీ చేయవచ్చని సమాచారం. ఈ స్థానంలో యాదవ్ వర్గం ఆధిపత్యం ఎక్కువ. ఇక్కడ సమాజ్ వాదీ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించింది. మెయిన్‌పురిలోని కర్హల్ స్థానంలో మూడో దశలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 20న అక్కడ ఓటింగ్ జరగనున్నాయి. నామినేషన్ వేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 1. జనవరి 26 తర్వాత ఈ సీటుపై అఖిలేష్ యాదవ్ పోటీపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటగా భావించే మెయిన్‌పురి జిల్లాలో అఖిలేష్ బరిలోకి దిగడంతో ఆపార్టీకి కలిసొస్తుందని సమాజ్‌వాదీ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
అంతకుముందు అజంగఢ్‌లోని గోపాల్పూర్ స్థానం నుంచి అఖిలేష్ పోటీ చేస్తారని గతంలో ఊహాగానాలు వచ్చాయి. ప్రస్తుతం కొత్త పేరు తెరపైకి వచ్చింది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ ప్రస్తుతం అజంగఢ్ నుంచి లోక్‌సభ ఎంపీగా కొనసాగుతున్నారు. అఖిలేష్ యాదవ్ తన తండ్రి, ములాయం సింగ్ యాదవ్ పార్లమెంటరీ నియోజకవర్గమైన మెయిన్‌పురిలోని ఏదైనా అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయవచ్చని చాలా కాలంగా చర్చ జరిగింది. మెయిన్‌పురి సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటగా ఉంది. అఖిలేష్ యాదవ్ మెయిన్‌పురి నుండి పోటీ చేస్తే, దాని ప్రభావం ఇతర సమీప జిల్లాలపై ఉంటుందని ఎస్పీ భావిస్తోంది. అఖిలేష్ ఇక్కడి నుంచి పోటీ చేయడం వల్ల కాన్పూర్, ఆగ్రా డివిజన్లలోని అనేక స్థానాలతో పాటు ఫిరోజాబాద్, ఎటా, ఔరయ్యా, ఇటావా, కన్నౌజ్‌తో సహా అనేక స్థానాలు ప్రభావితం కావచ్చని ఎస్పీ అంచనా.
కర్హల్ నియోజకవర్గంలో ఎస్పీ ఎప్పటి నుంచో స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తోంది. 2007, 2012, 2017లో వరుసగా మూడు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ విజయం సాధించింది. కర్హల్ అసెంబ్లీ సైఫాయికి దగ్గరగా ఉంది. ఇక్కడ ఎస్పీ అధినేత కుటుంబం జోక్యం చాలా ఉంటుంది. ఎస్పీకి చెందిన సోబ్రాన్ యాదవ్ గత మూడుసార్లు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2017 ఎన్నికలలో సోబ్రాన్ సింగ్ యాదవ్ 1,04,221 ఓట్లు సాధించారు. 38,405 ఓట్ల మెజార్టీతో బిజెపికి చెందిన రామ్ షాక్యాను ఓడించారు. దీంతో ఎస్పీ కంచుకోట అయిన కర్హల్ నుంచి ఈసారి అఖిలేష్ యాదవ్ బరిలోకి దిగొచ్చని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే 2005 కంటే ముందు ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తానని అఖిలేష్ యాదవ్ హామీ ఇచ్చారని, ఇందుకు అవసరమైన నిధులు కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేద్దాం. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని దాదాపు 12 లక్షల మంది ఉద్యోగులు లబ్ది పొందుతారని అఖిలేష్ తెలిపారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.