ఎన్నికల సంఘం అధికారులు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. స్థానిక అభ్యర్థులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వారణాసి డీఎం ఈవీఎంలను రవాణా చేస్తున్నారని ఆరోపించారు. ఎగ్జిట్ పోల్స్ బీజేపీ గెలుస్తుందన్న భావన కల్పించేలా ఉన్నాయని అన్నారు. ప్రజాస్వామ్యం కోసం ఇదే చివరి పోరాటమని అన్నారు. అభ్యర్థులకు సమాచారం ఇవ్వకుండానే ఈవీఎంలను రవాణా చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈవీఎంలను ఈ విధంగా రవాణా చేస్తుంటే అంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఇది దొంగతనమని.. మన ఓట్లను మనం కాపాడుకోవాలని అఖిలేష్ యాదవ్ అన్నారు. దీనికి వ్యతిరేకంగా మనం కోర్టుకు వెళ్లవచ్చని.. కానీ అంతకంటే ముందు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేయాలనుకుంటున్నానని అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు. అయోధ్యలో సమాజ్‌వాదీ పార్టీ గెలవబోతోందని.. అందుకే బీజేపీ భయపడుతోందని ఆయన విమర్శించారు.
బనారస్‌లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని ఆరోపించారు. గత ఎన్నికల్లో 5000 కంటే తక్కువ తేడాతో బీజేపీ గెలిచిన స్థానాలు 47 వరకు ఉన్నాయని అన్నారు. బనారస్‌లో ఒక వాహనం పట్టుబడిందని.. రెండు వాహనాలు పారిపోయాయని అన్నారు. సెక్యూరిటీ లేకుండా ఈవీఎంలు తీసుకెళ్తున్నారంటే కారణం ఏంటని ప్రశ్నించారు.
ఒకవేళ ఈవీఎంలను తొలగించాలనుకుంటే అభ్యర్థికి చెప్పాలని కదా అని వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషన్‌పై తనకు నమ్మకం లేదన్న అఖిలేష్ యాదవ్.. వారణాసి జిల్లా మేజిస్ట్రేట్‌పై చర్యలు తీసుకోవాలని అన్నారు.
Punjab Exit Polls: కాంగ్రెస్‌కు ఆప్ బిగ్ షాక్.. పంజాబ్‌లో చీపురు పార్టీదే హవా..
UP Exit Polls 2022: యూపీలో బీజేపీదే గెలుపు.. కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు
ఇక ఉత్తరప్రదేశ్‌లో బీజేపీదే అధికారం అని దాదాపు అన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. Matrize సంస్థ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ కూటమికి 262- 277, ఎస్పీ కూటమికి 119- 134, బీఎస్పీకి 7-15, కాంగ్రెస్‌కు 3-8 సీట్లు రానున్నాయి. P-Marq ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం బీజేపీకి కూటమికి 240, ఎస్పీ కూటమికి 140, బీఎస్పీకి 17, కాంగ్రెస్‌కు 4, ఇతరులకు 2 సీట్లు రావొచ్చు. Polstrat ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం బీజేపీ కూటమికి 211-225, ఎస్పీ కూటమికి 116-160, బీఎస్పీకి 14-24, కాంగ్రెస్‌కు 4-6 సీట్లు రానున్నాయి. ETG Research ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం బీజేపీ కూటమికి 230-245, ఎస్పీ కూటమికి 150-165, బీఎస్పీకి 5-10, కాంగ్రెస్‌కు 2-6, ఇతరులకు 2-6 సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.