అయోధ్య తీర్పుపై సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ ఏమన్నారంటే..

అయోధ్యలో భవ్య రామ మందిరం నిర్మించాలని సుప్రీంకోర్టుకు చెందిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే కదా. ఈ తీర్పుపై సల్మాన్ ఖాన్ తండ్రి ఏమన్నారంటే..

news18-telugu
Updated: November 10, 2019, 5:24 PM IST
అయోధ్య తీర్పుపై సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ ఏమన్నారంటే..
తండ్రి సలీమ్‌ఖాన్‌తో సల్మాన్ (ఫైల్ పోటో)
news18-telugu
Updated: November 10, 2019, 5:24 PM IST
అయోధ్యలో భవ్య రామ మందిరం నిర్మించాలని సుప్రీంకోర్టుకు చెందిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే కదా. ఈ తీర్పుపై అన్ని వర్గాల నుంచి సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పుపై సంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్.. తండ్రి సలీమ్ ఖాన్ స్పందించారు. అంతేకాదు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును స్వాగతించారు. అదే విధంగా సుప్రీంకోర్టు చెప్పినట్టు ముస్లిములు వేరే చోట ఇస్తామన్న భూమిలో మసీదు కాకుండా కాలేజీ  కట్టాలని సలహా ఇచ్చారు. ముస్లిములకు మసీదు కన్నా కాలేజీ ముఖ్యమన్నారు. ఇన్నాళ్లు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన తీర్పు వెలువడిన సమయంలో ప్రజలు చూపించిన శాంతి, సుహృద్భావాన్ని ఆయన కొనియాడారు. అంతేకాదు దేశ ప్రజలందరు కలిసి మెలిసి జీవించాలన్నారు.

 

First published: November 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...