పుల్వామా ఉగ్రదాడి అనంతరం కాశ్మీరీలపై ఎక్కడికక్కడ దాడులు జరుగుతున్నాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లక్నోలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది . దాలి గంజ్ ఏరియాలో డ్రైఫ్రూట్స్ అమ్ముతున్న కాశ్మీరి వ్యాపారులపై ఇద్దరు వ్యక్తులతో దాడికి దిగారు. అక్కడ వ్యాపారం చేసేందుకు వీళ్లేందుకు వారిపై కర్రలతో దాడికి దిగారు. అయితే దాడికి కారణం వారు కాశ్మీరీ వ్యాపారుల కావడమేనని తెలుస్తోంది. బాధితులు తమ ఐడీ కార్డు, ఆధార్ కార్డు చూపిస్తున్నా కూడా వదలకుండా వాళ్లని కొట్టడం జరిగింది. దీంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు సీన్‌లోకి ప్రవేశించి కేసు నమోదు చేశారు. అయితే దాడికి దిగిన వ్యక్తులు హిందుత్వ సంఘాలకు చెందినవారని స్థానికులు చెబుతున్నారు.
ఇటీవల ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలోని ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన దుకాణాల్ని వీహెచ్పీ కార్యకర్తలు పోలీసులు సమక్షంలో మూసివేశారు.ఫరీద్పూర్, బరేలీలో ప్రదర్శనలో కాశ్మీరీ దుకాణాలను కూడా వారు బలవంతంగా క్లోజ్ చేయించారు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం దేశ వ్యాప్తంగా కూడా కాశ్మీరీలపై జనం తిరగబడ్డారు. ఎక్కడికక్కడ కాశ్మీర్ ప్రజల్ని అడ్డుకున్నారు. పలు యూనివర్శిటీల్లో చదువుతున్న కాశ్మీరి విద్యార్థులకు కూడా చేదు అనుభవం ఎదురయ్యింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jammu and Kashmir, Kashmir, Pulwama Terror Attack, Uttar pradesh, VHP