హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

విమానం ఎక్కాలంటే ఈ నిబంధనలను తప్పనిసరి పాటించాల్సిందే..

విమానం ఎక్కాలంటే ఈ నిబంధనలను తప్పనిసరి పాటించాల్సిందే..

బ్రిటర్‌లో కొత్త రకం వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు ఇప్పటికే పలు దేశాలు బ్రిటన్ నుంచి విమాన సర్వీసులను రద్దు చేశాయి. ఆ జాబితాలో ఇప్పుడు భారత్ కూడా చేరింది.

బ్రిటర్‌లో కొత్త రకం వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు ఇప్పటికే పలు దేశాలు బ్రిటన్ నుంచి విమాన సర్వీసులను రద్దు చేశాయి. ఆ జాబితాలో ఇప్పుడు భారత్ కూడా చేరింది.

విమానయానానికి సంబంధించి స్టాండర్డ్ ఆపరేంటింగ్ ప్రొసీజర్‌ని విడుదల చేసింది. విమాన ప్రయాణికులతో పాటు విమానయాన సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక సూచనలు జారీ చేసింది.

భారత్‌లో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కరోనా ఉన్నప్పటికీ దానితో కలిసి జీవించేందుకు అంతా సన్నద్ధమవుతున్నారు. లాక్‌డౌన్ 4లో ఇచ్చిన సడలింపులతో ఇప్పటికే ప్రజా రవాణా ప్రారంభమైంది. రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి. ఇప్పటికే ప్రత్యేక రైళ్లు నడుస్తుండగా.. జూన్ 1 నుంచి మరిన్ని సర్వీసులను పునరద్ధరిస్తామని రైల్వేశాఖ తెలిపింది. ఇక ఈ నెల 25 నుంచి దేశీయ విమానాలు కూడా ఎగరనున్నాయి. ఈ నేపథ్యంలో విమానయానానికి సంబంధించి స్టాండర్డ్ ఆపరేంటింగ్ ప్రొసీజర్‌ని విడుదల చేసింది. విమాన ప్రయాణికులతో పాటు విమానయాన సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక సూచనలు జారీ చేసింది.

విమానయానంలో తప్పక పాటించాల్సినవి:

గేట్ వద్ద బోర్డింగ్ పాస్‌ను స్కాన్ చేయడంతో పాటు సిబ్బందికి ఐడీ కార్డ్ చూయించాలి.

కంటైన్మెంట్ జోన్ ప్రాంతం నుంచి వచ్చిన వారిని ఎయిర్‌పోర్టు లోపలికి అనుమతించరు.

14 ఏళ్ల లోపు పిల్లలకు మినహా మిగతా ప్రయాణికుల ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్‌ ఉండాలి.

యాప్‌లో గ్రీన్ కలర్ చూపించకపోయినా, అసలు ఫోన్‌లో యాప్ లేకపోయినా వారిని లోపలికి అనుమతించరు.

ఎయిర్‌పోర్టు లోపలికి వెళ్లేటప్పుడు ప్రతి ప్రయాణికుడికి థర్మల్ స్క్రీనింగ్ చేయాలి.

నిర్దేశించిన సమయానికి కంటే రెండు గంటల ముందే విమానాశ్రయాలకు చేరుకోవాలి.

విమాన సమయానికి 4 గంటల ముందు మాత్రమే టెర్మినల్‌లోకి అనుమతిస్తారు.

విమానయాన సిబ్బంది, ప్రయాణికుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు ట్యాక్సీలు, ఇతర రవాణా సౌకర్యాలను కల్పించాలి.

ఎయిర్‌పోర్టు నుంచి సిబ్బంది, ప్రయాణికుల రాకపోకలకు వ్యక్తిగత వాహనాలు, క్యాబ్ సేవలకు మాత్రమే అనుమతి ఉంటుంది.

విమాన ప్రయాణికులు మాస్క్‌లు, గ్లౌజులు ధరించాలని విమానయాన సంస్థలు ప్రకటనలు చేయాలి.

బోర్డింగ్ గేట్ వద్ద సేఫ్టీ కిట్, మాస్క్, శానిటైజర్, ఫేస్ షీల్డ్ తీసుకోవాలి.

విమానం లోపల భోజన సదుపాయం ఉండదు. ఇంటి నుంచి తీసుకెళ్లవచ్చు.

న్యూస్ పేపర్లు, మ్యాగజైన్లను లోపలికి అనుమతించరు.

విమానం లోపల ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా మార్కింగ్ ఉండాలి.

సిబ్బంది వద్ద శానిటైజర్లు, వ్యక్తిగత రక్షణ తొడుగులు సిబ్బంది వద్ద ఖచ్చితంగా ఉండాలి.

ప్రత్యేక సందర్భాల్లో మినహా రాకపోకల సెక్షన్ల వద్దకు ట్రాలీలను అనుమతించరు. ఒకవేళ అవసరం వస్తే తప్పకుండా శానిటైజ్ చేయాలి.

First published:

Tags: Corona virus, Coronavirus, Covid-19, Flight, Lockdown

ఉత్తమ కథలు