Home /News /national /

SADLY 25 PATIENTS LEGS ARE AMPUTATED DAILY IN THAT STATE IF YOU KNOW THE REASON YOU WILL BE SAD UMG GH

Amputations: పాపం.. ఆ స్టేట్‌లో రోజూ 25 మంది రోగులకు కాళ్లు తొలగిస్తున్నారు.. కారణం ఏంటో తెలుసా..?

 పాపం.. ఆ స్టేట్ లో రోజూ 25 మంది రోగులకు కాళ్ళు తొలగిస్తునారు .. కారణం ఏంటో తెలిస్తే బాధపడతారు !

పాపం.. ఆ స్టేట్ లో రోజూ 25 మంది రోగులకు కాళ్ళు తొలగిస్తునారు .. కారణం ఏంటో తెలిస్తే బాధపడతారు !

కేరళ(Kerala)లో ప్రతిరోజూ దాదాపు 20 నుంచి 25 మందికి వివిధ కారణాలతో కాలు(Leg)ను తొలగిస్తున్నట్లు వాస్కులర్ సొసైటీ ఆఫ్ కేరళ (VASK) తెలిపింది. దాదాపు ప్రతి గంటకు ఒకరి కాలును తొలగిస్తున్నట్లు ఈ సంస్థ గుర్తించింది. భయంకరమైన విషయం ఏమిటంటే.. బాధితుల్లో దాదాపు 80 శాతం కేసులకు కాలు తొలగించాల్సిన అవసరం లేదు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
మన శరీరం(Body)లో ఏదైనా అవయవానికి కోలుకోలేని వ్యాధి సోకినప్పుడు, దాన్ని తొలగించక తప్పదు. కాలు లేదా చేతికి వచ్చే ఇన్ఫెక్షన్(Infection), ఇతర శరీర భాగాలకు సోకకూడదనే ఉద్దేశంతో డాక్టర్లు ఆ అవయవాన్ని తొలగిస్తారు. అయితే కేరళ(Kerala)లో ఇలాంటి అంగచ్ఛేదనకు సంబంధించి షాకింగ్ న్యూస్(News) బయటకు వచ్చింది. ఆ రాష్ట్రంలో ప్రతిరోజూ దాదాపు 20 నుంచి 25 మందికి వివిధ కారణాలతో కాలును తొలగిస్తున్నట్లు వాస్కులర్ సొసైటీ ఆఫ్ కేరళ (VASK) తెలిపింది. దాదాపు ప్రతి గంటకు ఒకరి కాలును తొలగిస్తున్నట్లు ఈ సంస్థ గుర్తించింది. భయంకరమైన విషయం ఏమిటంటే.. బాధితుల్లో దాదాపు 80 శాతం కేసులకు కాలు తొలగించాల్సిన అవసరం లేదు. ఇలా అంగచ్ఛేదన బాధితుల్లో సగం మంది మరో కాలును కోల్పోతారు లేదా రాబోయే రెండేళ్లలో గుండె జబ్బులతో మరణిస్తారని VASK విశ్లేషణలో వెల్లడైంది.

వ్యాధి బారిన పడిన అవయవాన్ని రక్షించడానికి ఎంపిక చేసిన కేంద్రాలలో కొత్త చికిత్స పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. అవయవాలకు రక్త ప్రవాహం లేక, లేదా తీవ్రమైన గాయం ద్వారా ఇన్‌ఫెక్ట్‌ అయిన కాలును మాత్రమే వైద్యులు(Doctors) తొలగిస్తారు. 40 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారిలో చాలా మంది అంగవైకల్యంతో ఉన్నారని VASK డేటా చెబుతోంది.

VASK వ్యవస్థాపక కార్యదర్శి, తిరువనంతపురం మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌(Hospital)లో వాస్కులర్, థొరాసిక్ సర్జరీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్‌.సి.శ్రీకుమార్ ఈ విషయంపై మాట్లాడారు. ‘కాలు తీసేయాలన్న నిర్ణయం ప్రాక్టికల్‌గా అనిపించవచ్చు. రోగి, పక్కనే ఉన్నవారు కాలు తొలగించడమే శాశ్వత పరిష్కారం అని నమ్ముతారు. వారు చికిత్సకు అవసరమైన డబ్బును ఆదా చేయగలుగుతారు. ఇది నిజం కాదు.’ అని చెప్పారు. మధుమేహం, ధూమపానం కారణంగానే కాళ్లకు రక్తప్రసరణ ఆగిపోయి ఇన్ఫెక్షన్‌కు గురవుతాయి. అధిక రక్తపోటు(Blood pressure), కొలెస్ట్రాల్ కూడా దీనికి కారణం కావచ్చు.

కొత్త సర్జరీలకు ఖర్చు ఎక్కువ
కొత్త అధ్యయనాలు, చికిత్సా పద్ధతుల ద్వారా దెబ్బతిన్న కాళ్లను రక్షించవచ్చని నిపుణులు చెబుతున్నారు. రోగి మానసిక, శారీరక శ్రేయస్సు కోసం మాత్రమే కాళ్లను తొలగిస్తారు. కాళ్లను రక్షించడం కూడా ఖర్చుతో కూడుకున్నది. అయినప్పటికీ, రోగులు అజ్ఞానం, కొంతమంది వైద్యుల నిరంతర ప్రోద్బలంతో కాళ్లను తొలగించడానికి అంగీకరిస్తారని ఆరోగ్య నిపుణులు చెప్పారు.

ఇదీ చదవండి: Success Story: జేజేఈ మెయిన్ టాపర్‌గా అసోం అమ్మాయి.. ప్రిపరేషన్‌లో ఆమె చెప్తున్న మాటలు వింటే మైండ్ పోద్ది !


VASK చేసిన పోస్ట్-అంప్యుటేషన్ విశ్లేషణలో 50% మంది రోగులు గుండె జబ్బు(Heart attack)లతో చనిపోయారని లేదా రెండేళ్లలో రెండో కాలును కూడా కోల్పోవాల్సి వచ్చిందని కనుగొన్నారు. చాలా మంది వికలాంగులకు సోషల్‌ సపోర్ట్‌ ఉండదని, కేవలం 20% మంది మాత్రమే సోషలైజ్‌ అవుతారని శ్రీకుమార్‌ తెలిపారు. చాలా మందికి రెండు వారాల పాటు మాత్రమే సపోర్ట్‌ లభిస్తుంది. తర్వాత వారికి వారే జీవనం సాగించాలి. దీనికి తోడు చాలా మంది పోస్ట్-అంప్యుటేషన్ రివ్యూకు హాజరుకావడం లేదని శ్రీకుమార్‌ వివరించారు.

ఇటీవలే మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేసిన డాక్టర్ రెమ్లా బీవీ మాట్లాడుతూ..‘కొత్త అవయవ ఏర్పాటు విధానాలు వికలాంగుల సంఖ్యను తగ్గిస్తాయని భావిస్తున్నాం. చాలా మందికి డయాబెటిక్ (Diabetic)ఫుట్ కారణంగా కాలును తొలగించాల్సి వస్తోంది. రోగులు వారి అవయవాలను రక్షించడంలో సహాయపడటానికి పాడియాట్రీ లేదా పాదాల సంరక్షణను ప్రత్యేకంగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.’ అని చెప్పారు.VASK ‘సేవ్ ఎ లింబ్, సేవ్ ఎ లైఫ్’ అనే ప్రచారాన్ని ప్రారంభించింది. రోగుల కాళ్లను తొలగించే సర్జరీలకు చెక్ పెట్టేందుకు, ఈ ప్రక్రియలో వారి జీవితాన్ని రక్షించడానికి టోల్-ఫ్రీ నంబర్ 18001237856ను అందుబాటులోకి తీసుకొచ్చింది. హెల్ప్‌లైన్ రోగులను టాప్ వాస్కులర్ సర్జన్‌లతో మాట్లాడేలా చేస్తుంది. ఆగస్టు 6న ఈ నంబర్‌ను ప్రారంభించినప్పటి నుంచి 200కు పైగా కాల్స్ వచ్చాయి.

రోగుల ఆప్షన్‌లు
సాల్వేజ్‌ ట్రీట్‌మెంట్స్‌లో మెదడుకు రక్త ప్రవాహాన్ని నిర్ధారించడం, ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడం వంటివి ఉంటాయి. చికిత్సకు రూ.1-2 లక్షలు ఖర్చవుతుంది. మంచి ప్రొస్తెటిక్ లెగ్, సపోర్టు సిస్టమ్‌ని పొందాలంటే దాదాపు రూ.3-4 లక్షలు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం అందించే ప్రోస్తేటిక్స్‌ను ఎవరైనా ఉచితంగా పొందవచ్చు లేదా రూ.50,000కి పొందవచ్చు. అయితే ఫ్లెక్సిబిలిటీని నిర్ధారించే ప్రోస్తేటిక్స్‌కు చాలా ఎక్కువ ఖర్చవుతుందని వైద్యులు చెబుతున్నారు.
Published by:Mahesh
First published:

Tags: Blood pressure, Diabetic, Hospitals, Kerala

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు