Home /News /national /

మద్రాస్ హైకోర్టులో సద్గురు పిటిషన్.. ఆలయాలను ప్రభుత్వ అజమాయిషీ నుంచి తప్పించాలని విజ్ఞప్తి

మద్రాస్ హైకోర్టులో సద్గురు పిటిషన్.. ఆలయాలను ప్రభుత్వ అజమాయిషీ నుంచి తప్పించాలని విజ్ఞప్తి

సద్గురు జగ్గీ వాసుదేవ్ (File)

సద్గురు జగ్గీ వాసుదేవ్ (File)

ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ మద్రాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. మద్రాస్ హైకోర్టులోని మధురై బెంచ్‌లో ఆయన పిటిషన్ దాఖలు చేశారు.

    ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ మద్రాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. మద్రాస్ హైకోర్టులోని మధురై బెంచ్‌లో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. తమిళనాడు రాష్ట్రంలో ఆలయాలను ప్రభుత్వ ఆధీనం నుంచి తప్పించాలని కోరుతూ ఆయన ఈ పిటిషన్ వేశారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని మొదటి ప్రతివాదిగా, దేవాదాయ ధర్మాదాయ శాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీని రెండో ప్రతివాదిగా చేర్చారు. ఆలయాలను ప్రభుత్వ అజమాయిషీ నుంచి తప్పించాలంటూ ప్రభుత్వాన్ని పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ అటు నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేకపోవడంతో ఆయన కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. రెండు విషయాల్లో హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా తన పిటిషన్‌లో సద్గురు జగ్గీ వాసుదేవ్ కోరారు.

    సద్గురు జగ్గీ వాసుదేవ్ పిటిషన్‌లో పేర్కొన్న అంశాలు
    1. తమిళనాడు రాష్ట్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్న 44,000కు పైగా ఉన్న ఆలయాలకు సంబంధించి ప్రైవేట్ ఆడిట్ నిర్వహించాలి. ఆలయాల పరిస్థితి ఎలా ఉంది? వాటి నిర్మాణం ఎలా ఉంది? ఏవైనా శిథిలావస్థకు చేరుకున్నాయా? ఆలయాలకు సంబంధించి స్థిర, చరాస్తులు ఎన్ని ఉన్నాయి? అవి ఆలయాల పరిధిలోనే ఉన్నాయా? అన్యాక్రాంతం అయ్యాయా? ఎంత అద్దెలు వస్తున్నాయి? ఎంత అద్దెలు బకాయి ఉన్నాయి? ఎక్కడెక్కడో ఉండే ఒక్కో ఆలయాల్లో ధూపధీప నైవేద్యాల పరిస్థితి ఏంటి? భక్తులు సమర్పించే కానుకలు, ఇతర ఆదాయ వివరాలు అన్నింటి మీదా సమగ్రంగా ఆడిట్ నిర్వహించాలి.

    2. ఆలయాలను ప్రభుత్వం అజమాయిషీ నుంచి తప్పించి ప్రజల చేతికే అందించేలా చూడాలి. ఆలయాల్లో సంప్రదాయాలు, నిర్వహణకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలి. ఆ కమిటీలో ఆయా రంగాల నిపుణులు, ప్రముఖులను నియమించాలి.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Madras high court, Tamil nadu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు