సచిన్ టెండూల్కర్‌కు ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకం.. ఎందుకో తెలుసా ?

సచిన్ టెండూల్కర్ తన కుటుంబం మొత్తంతో కలిసి బాంద్రాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా సచిన్ కుమారుడు, కుమార్తె ఇద్దరూ ఈ సారి ఎన్నికల్లో ఓటు హక్కు పొందారు. దీంతో వీరంతా కలిసి ఈ సారి కుటుంబ సమేతంగా తొలిసారి ఓటు వేయడం విశేషం.

news18-telugu
Updated: April 29, 2019, 7:14 PM IST
సచిన్ టెండూల్కర్‌కు ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకం.. ఎందుకో తెలుసా ?
ఓటు వేసిన సచిన్ (ఫైల్ చిత్రం)
news18-telugu
Updated: April 29, 2019, 7:14 PM IST
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు ఈ ఎన్నికలు తనకు ఎంతో ప్రత్యేకమని తెలిపాడు. ఎందుకంటే ఈ సారి ఎన్నికల్లో తమ కుటుంబం మొత్తం కలిసి ఓటు వేసిందని, అందులోనూ ప్రత్యేకంగా తన కుమార్తె సారా, కుమారుడు అర్జున్ లతో కలిసి ఓటు వేయడం చాలా సంతోషంగా ఉందని సచిన్ తెలిపాడు. అంతే కాదు ఓటు వేసిన అనంతరం సచిన్ టెండూల్కర్ ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిస్తూ ట్విట్టర్ లో వీడియోను పోస్ట్ చేశారు. ఇదిలా ఉంటే సచిన్ టెండూల్కర్ తన కుటుంబం మొత్తంతో కలిసి బాంద్రాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా సచిన్ కుమారుడు, కుమార్తె ఇద్దరూ ఈ సారి ఎన్నికల్లో ఓటు హక్కు పొందారు. దీంతో వీరంతా కలిసి ఈ సారి కుటుంబ సమేతంగా తొలిసారి ఓటు వేయడం విశేషం.

 

First published: April 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...