ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi)ఉత్తరప్రదేశ్ అయోధ్యలో దీపోత్సవ్(Deepotsav)వేడుకలను ప్రారంభించారు. ఈసందర్భంగా తన మాటలు, ఆలోచనలు, పాలన ద్వారా శ్రీరాముడు పెంపొందించిన విలువలే సబ్కా సాథ్, సబ్కా వికాస్‌కు స్ఫూర్తి అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. సబ్కా విశ్వాస్, సబ్కా ప్రార్థనలకు కూడా ఇవే ప్రాతిపదిక అని ప్రధాని అన్నారు. దీపోత్సవంలో పాల్గొనేందుకు అయోధ్య(Ayodhya)కు వచ్చిన సమయంలో ప్రధాని మోదీ రామ్ కథా పార్క్‌లో శ్రీరాముడి రాజ్యాభిషేకం జరిగిన సభలో మోదీ ప్రసంగించారు. శ్రీరాముని ఆశీస్సుల వల్లే తనకు దేవుడి “దర్శనం” లభించిందన్నారు ప్రధాని మోదీ.
25ఏళ్లలో శ్రీరాముని పాలన ..
శ్రీరాముని దివ్యక్షేత్రమైన జరుగుతున్న దిపోత్సవ్ వేడుకను “అయోధ్య, యూపీ ప్రజలతో పాటు ప్రపంచ ప్రజలు ఈ సంఘటనను చూస్తున్నందుకు తాను ఎంతో సంతోషిస్తున్నానని చెప్పారు. మనం 'ఆజాదీ కా అమృత్ మహోత్సవం' జరుపుకుంటున్న తరుణంలో రాముడి వంటి సంకల్పం దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందన్నారు ప్రధాని. రాబోయే 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన భారతదేశం కోసం ఆకాంక్షించే ప్రజలకు శ్రీరాముని ఆశయాలు వెలుగులు నింపుతాయని ప్రధాని అన్నారు. అంతే కాదు అత్యంత కష్టమైన లక్ష్యాలను సాధించడానికి ఆ భగవంతుడు ఆశీస్సులతో పాటు ధైర్యం ప్రసాధించాలని కోరారు.
जन्मभूमि मम पुरी सुहावनि। उत्तर दिसि बह सरजू पावनि॥ अयोध्या की सरयू आरती में शामिल होने का सौभाग्य मिला। pic.twitter.com/iR9V6A5bFB
— Narendra Modi (@narendramodi) October 23, 2022
ప్రధాని రాక రెండో సారి..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం అయోధ్యలోని రామజన్మభూమిలో రామ్ లల్లాకు ప్రార్థనలు చేశారు. ఆగస్ట్ 5, 2020న రామ మందిర నిర్మాణం కోసం “భూమి పూజ” తర్వాత అయోధ్యకు రావడం ఇదే తొలిసారి. దీపోత్సవ వేడుకల కోసం అయోధ్య చేరుకు వచ్చిన ప్రధానికి సీఎం యోగి,గవర్నర్ ఆనందిబెన్ పటేల్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రధాని మోదీ తాత్కాలిక రామాలయానికి వెళ్లి రామ్ లల్లాకు ప్రార్థనలు చేశారు. ఆయన అక్కడ మట్టి దీపం వెలిగించి "హారతి" నిర్వహించారు. అలాగే ఆ స్థలంలో భారీ రామమందిరం నిర్మాణం జరుగుతోందని అధికారులు మోడీకి వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ayodhya, Diwali 2022, Narendra modi