అదే ఫైనల్ కాదు.. శబరిమలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తుది నిర్ణయం కాదని.. ఈ అంశాన్ని పరిశీలించేందుకు ఏడుగురు సభ్యులతో కూడిన విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశామని తెలిపింది.

news18-telugu
Updated: December 6, 2019, 6:19 AM IST
అదే ఫైనల్ కాదు.. శబరిమలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
శబరిమల వివాదంపై ఇంకా క్లారిటీ రాలేదు. గత ఏడాది వచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేసింది. ఐతే అన్ని వయసుల మహిళలూ శబరిమల ఆలయంలోకి ప్రవేశించవచ్చన్న గత ఏడాది తీర్పుపై మాత్రం స్టే ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అదే తీర్పు అమల్లో ఉంటుందని పలు మహిళా సంఘాలు అంటున్నాయి. అందుకే తమను శబరిమలలోకి అనుమతించాలంటూ డిమాండ్ చేస్తున్నాయి.

ఈ క్రమంలో అయ్యప్ప ఆలయంలోకి వెళ్లకుండా తమను అడ్డుకుంటున్నారని బిందు అమ్మిని అనే మహిళ ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై విచారణ చేసిన సీజేఏ బాబ్డే నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తుది నిర్ణయం కాదని.. ఈ అంశాన్ని పరిశీలించేందుకు ఏడుగురు సభ్యులతో కూడిన విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశామని తెలిపింది. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశం అంశంపై ఆ బెంచ్ తుది తీర్పు వెలువరిస్తుందని.. ప్రస్తుతానికి ఎలాంటి తుది నిర్ణయాలు లేవని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.


First published: December 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>