పుల్వామా దాడి నేపథ్యంలో మోదీకి ఫోన్ చేసిన రష్యా అధ్యక్షుడు పుతిన్

పుతిన్‌తో మోదీ, ఫైల్ ఫోటో (Image: PIB/PTI)

కాశ్మీర్‌లోని పుల్వామాలో ఫిబ్రవరి 14న ఉగ్ర దాడిలో 40 మంది CRPF సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధాని మోదీకి ఫోన్‌ చేసి భారత్‌లో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు.

  • Share this:
    కాశ్మీర్‌లోని పుల్వామాలో ఫిబ్రవరి 14న ఉగ్ర దాడి జరిగింది. ఈ ఉగ్ర దాడిలో 40 మంది CRPF సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాది ఆదిల్ దార్... పాకిస్థాన్‌లోని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలో ట్రైనింగ్ తీసుకున్నట్లు భారత్‌కు ఆధారాలు కూడా లభించాయి. ఈ నేపథ్యంలో పుల్వామా ఉగ్ర దాడి ఘటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌  దిగ్భ్రాంతి చెందారు.ఈ మేరకు ప్రధాని మోదీకి ఆయన ఫోన్‌ చేసి భారత్‌లో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు. అంతేకాకుండా.. భారత్ సైనికులపై ఉగ్ర దాడిని ఆయన ఖండించారు. అనంతరం ఇరు దేశాల మధ్య ఉన్న పరిస్థితుల గురించి పుతిన్ తెలుసుకున్నారు. ఇప్పటికైనా ఉగ్రవాదులకు పాక్ స్థావరం కల్పించరాదని ఆయన కోరారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత ప్రజలు చేస్తున్న పోరాటానికి పుతిన్‌ సంఘీభావం తెలిపారు.

    రాశీఖన్నా లేటెస్ట్ హాట్ ఫోటోస్
    First published: