ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి..

ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి..

ప్రతీకాత్మక చిత్రం..

ఆసియావ్యాప్తంగా అమ్మకాలు క్షీణించడం, ఇన్వెస్టర్లు సేఫ్ ట్రేడింగ్ పైనే ఎక్కువ ఆసక్తి కనబరుస్తుండటంతో మార్కెట్లు పతనమవుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు.

 • Share this:
  సోమవారం ఓపెనింగ్ ట్రేడ్‌లోనే రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే 69.62 వద్ద ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూలత, టర్కీ మార్కెట్‌లో నెలకొన్న సంక్షోభం కారణంగానే రూపాయి విలువ పతనమైందని నిపుణులు చెబుతున్నారు. రూపాయి తిరిగి పుంజుకునేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు మొదలుపెట్టినట్టు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టర్కీపై ఆంక్షలు విధించడమే ఆ దేశ కరెన్సీ పతనానికి కారణమని తెలుస్తోంది.

  గత శుక్రవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి 68.54 వద్ద ముగిసింది. అయితే ఒక్క రూపాయి మాత్రమే కాదు, చాలా దేశాల కరెన్సీలు సైతం పతనమైనట్టు నివేదికలు చెబుతున్నాయి. టర్కీష్ లిరా 45శాతం మేర పడిపోవడం గమనార్హం. ఇక బీఎస్ఈ సెన్సెక్స్ సోమవారం ఓపెనింగ్ ట్రేడ్‌లోనే 288పాయింట్ల మేర పతనమైంది. ఎన్ఎస్ఈ సూచీ 11,400కు పడిపోయి ట్రేడ్ అవుతోంది. దీంతో పీఎస్‌యూ, ఆటో, మెటల్, బ్యాంకింగ్ రంగాల ఈక్విటీ మార్కెట్లకు భారీ నష్టం చేకూరింది. ఆసియావ్యాప్తంగా అమ్మకాలు క్షీణించడం, ఇన్వెస్టర్లు సేఫ్ ట్రేడింగ్ పైనే ఎక్కువ ఆసక్తి కనబరుస్తుండటంతో మార్కెట్లు పతనమవుతున్నట్టు సమాచారం.
  Published by:Srinivas Mittapalli
  First published:

  అగ్ర కథనాలు