Home /News /national /

RUPEE CONTINUOUS FALL AND WE SHOULD KNOW ABOUT HOW IT WILL IMPACT UMG GH

Rupee Fall: రోజురోజుకూ పడిపోతున్న రూపాయి.. దీని ఎఫెక్ట్ మనపైనే.. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా..?

రూపాయి పతనం.

రూపాయి పతనం.

అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత కరెన్సీ అయిన రూపాయి విలువ రోజురోజుకీ క్షిణిస్తోంది. బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి 11 పైసలు క్షీణించి అమెరికా డాలర్‌తో పోలిస్తే సరికొత్త ఆల్ టైమ్ కనిష్ట స్థాయి 78.96కి చేరుకుంది. విదేశీ పెట్టుబడులు స్థిరంగా వెనక్కు వెళ్లిపోవ

ఇంకా చదవండి ...
అమెరికా డాలర్‌ (Dollar)తో పోలిస్తే భారత కరెన్సీ అయిన రూపాయి (Rupee) విలువ రోజురోజుకీ క్షిణిస్తోంది. బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి 11 పైసలు క్షీణించి అమెరికా డాలర్‌తో పోలిస్తే సరికొత్త ఆల్ టైమ్ కనిష్ట స్థాయి 78.96కి చేరుకుంది. విదేశీ పెట్టుబడులు స్థిరంగా వెనక్కు వెళ్లిపోవడం వల్ల దేశీయ కరెన్సీ గత కొన్ని నెలల్లో రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. 2021 అక్టోబర్ నుంచి ఇప్పటివరకు FPIలు రూ. 2,69,424 కోట్లను ఉపసంహరించుకున్నాయి. అదే నెల నుంచి విదేశీ పెట్టుబడులు నిరంతరాయంగా తరలిపోతున్నాయి. ఇది రూపాయి క్షీణతకు ప్రధాన కారణం.

రూపాయి పతనానికి కారణం
గత కొన్ని నెలలుగా రూపాయి అస్థిరతను చవిచూస్తోంది. 2022, జనవరి 12న ఒక డాలర్‌కి రూపాయి మారకం రూ. 73.77గా ఉంది. అప్పటి నుంచి మన కరెన్సీ విలువ రూ.5 పడిపోయి, బుధవారం నాటికి రూ.78.96కి చేరుకుంది. అయితే జనవరి 12 నుంచి పతనం నిరంతరంగా లేదు. జనవరి 12 నుంచి మార్చి 8 మధ్య బలహీనపడి రూ.77.13కి చేరుకుంది. ఆపై ఏప్రిల్ 5 వరకు బలపడి డాలర్‌తో పోలిస్తే రూ.75.23కి చేరుకుంది. ఏప్రిల్ 5 నుంచి రూపాయి విలువ పతనాన్ని చూస్తూనే ఉంది. అప్పటి నుంచి అనేక సార్లు ఆల్ టైమ్ కనిష్ట స్థాయిలను తాకింది.

ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (FPIs) నిష్క్రమణ కారణంగా డాలర్ల అవుట్ ఫ్లో కొనసాగడమే గత కొన్ని నెలలుగా రూపాయి పతనానికి ప్రధాన కారణం. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితులు, US ఫెడరల్ రిజర్వ్ కఠినమైన ద్రవ్య విధానం నేపథ్యంలో FPIలు ఇండియా నుంచి తమ డబ్బును ఉపసంహరించుకుని, సురక్షిత పెట్టుబడుల కోసం USకి తరలివెళ్లారు. గత కొన్ని నెలలుగా పెరుగుతున్న ముడి చమురు ధరలు, సాధారణ డాలర్ బలం కూడా రూపాయి పతనానికి కారణమని చెప్పవచ్చు.

దీని ప్రభావం మనపై ఎలా ఉంటుంది?

ద్రవ్యోల్బణం
రూపాయి పతనం కారణంగా దిగుమతులు మరింత ఖరీదైనవిగా మారుతాయి. ఇది దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణమవుతుంది. భారతదేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం ఇప్పటికే ఏడు శాతానికి పైగా ఉంది. ఆర్‌బీఐ కంఫర్ట్ జోన్ రేటింగ్‌ అయిన 2-6 శాతానికి మించి ఉంది. దిగుమతులపై ఆధారపడటంతో పాటు ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG), మెటల్, పెట్రోల్ వంటి ఉత్పత్తుల ధరలు రూపాయి పతనం కారణంగా ప్రభావితమవుతాయి. ఫలితంగా వీటి ధరలు పెరగవచ్చు. రూపాయి పతనం కారణంగా విదేశీ విద్య, విదేశీ పర్యటనలు కూడా మరింత ఖరీదైనవిగా మారుతాయి. ఎందుకంటే డాలర్లను పొందడానికి ఎక్కువ రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: జీఎస్‌టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు.. వ్యాపారులకు గుడ్ న్యూస్.. మార్పులివే..!


పెట్టుబడులు
అధిక ద్రవ్యోల్బణం కారణంగా పెట్టుబడిదారుల మొత్తం రాబడులు ప్రభావితమవుతాయి. అలాగే రూపాయి విలువ పడిపోవడంతో దిగుమతి రంగాలు ఖర్చుల ఒత్తిడికి గురవుతాయి. ఈ రంగాల నుంచి అందే రాబడిని రూపాయి విలువ ప్రభావితం చేస్తుంది. రూపాయి విలువ క్షీణించడం ఎగుమతి రంగాలకు, ముఖ్యంగా ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) కంపెనీలకు మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఫార్మాస్యూటికల్ ఎగుమతిదారులు, ప్రత్యేక రసాయనాలు, వస్త్రాల రంగాల్లో ఉన్న బిజినెస్‌లు కూడా లాభపడతాయి. అయితే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG), మెటల్, బ్యాంకింగ్ వంటి రంగాలు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవచ్చు.

ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి
ఈ వారం డాలర్ ఇండెక్స్ అస్థిరంగా ఉంటుందని, 103.20-104.70 రేంజ్‌లో ట్రేడ్ అవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశీయ మార్కెట్లలో ఎఫ్‌ఐఐ విక్రయాలు ప్రస్తుతం రూపాయిపై ఒత్తిడి పెంచుతున్నాయి. ముడి చమురు ధరలు కూడా పెరుగుతున్నాయి. WTI బ్యారెల్‌కు $ 112 దాటింది, బ్రెంట్ ధరలు బ్యారెల్‌కు $ 116 దాటాయి. ఇవన్నీ రూపాయి విలువ పతనానికి కారణమయ్యాయి. ఈ వారం కూడా రూపాయి అస్థిరంగా ఉంటుందని, 79.30 లెవల్ వరకు ఉండవచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
Published by:Mahesh
First published:

Tags: Indian rupee

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు