RUCKUS IN MAHARASHRA ASSEMBLY 12 BJP MLA SUSPENDED FOR ONE YEAR FOR ABUSING SPEAKER AK
MLAs Suspend: అసెంబ్లీలో రగడ.. ఏడాది పాటు 12 బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
ప్రతీకాత్మక చిత్రం
MLAs Suspend: ఓబీసీ రిజర్వేషన్ల అంశంపై అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు గందరగోళం సృష్టించగా.. స్పీకర్ భాస్కర్ జాదవ్ వారికి మాట్లాడేందుకు తగిన సమయం కేటాయించలేదు.
మహారాష్ట్ర వర్షాకాల సమావేశాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. సభలో స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు ఆయనపై భౌతికంగా దాడి చేసినందుకు 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఏడాదిపాటు సస్పెండ్ చేశారు. అయితే ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ వీటిని తప్పుడు ఆరోపణలని ఆరోపించారు. ఏ ఒక్క బీజేపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. ఓబీసీ రిజర్వేషన్ల కోసం 12 మంది కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలను త్యాగం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. ఓబీసీ రిజర్వేషన్ల అంశంపై అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు గందరగోళం సృష్టించగా.. స్పీకర్ భాస్కర్ జాదవ్ వారికి మాట్లాడేందుకు తగిన సమయం కేటాయించలేదు.
సభ వాయిదా పడిన అనంతరం ప్రతిపక్ష సభ్యులు తన క్యాబిన్‌కు వచ్చిన తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని స్పీకర్ భాస్కర్ జాదవ్ తెలిపారు. అయితే స్పీకర్ సైతం సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రతిపక్షం ఆరోపించింది. దీంతో ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాల్సిందిగా రాష్ట శాసనసభా వ్యవహారాల మంత్రిని కోరారు. 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సంజయ్ కుటే, అశీష్ షెలార్, అభిమన్యు పవార్, గిరీష్ మహాజన్, అతుల్ భట్కాల్కర్, పరగ్ అల్వని, హరీశ్ పింపలే, రామ్ సత్పుటే, విజయ్ కుమార్ రావల్, యోగేష్ సాగర్, నారాయణ్ కుచే, కృతికుమార్ బంగ్డియాను సభ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేశారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.