Ram Mandhir: అయోధ్య రామాలయ అంశాన్ని లేవనెత్తిన ఆర్ఎస్ఎస్

Ram Mandhir: సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి అధికార పగ్గాలు చేపడుతున్న వేళ అయోధ్యలో రామాలయ నిర్మాణం అంశాన్ని ఆర్ఎస్ఎస్ లేవనెత్తింది.

news18-telugu
Updated: May 27, 2019, 11:23 AM IST
Ram Mandhir: అయోధ్య రామాలయ అంశాన్ని లేవనెత్తిన ఆర్ఎస్ఎస్
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్(ఫైల్ ఫోటో)
  • Share this:
దేశ ప్రధానిగా రెండోసారి నరేంద్ర మోదీ పగ్గాలు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్న వేళ...ఆర్ఎస్ఎస్ అయోధ్యలో రామాలయ నిర్మాణం అంశాన్ని లేవనెత్తింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రామమందిరం అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి గుర్తు చేశారు. ప్రధాని మోదీకి మోహన్ భగవత్ సోమవారం పంపిన ఓ సందేశంలో ‘రామ సేవను పూర్తి చేయాలి’ అని కోరారు. ఉదయ్‌పూర్‌లో మీడియాతో మాట్లాడిన మోహన్ భగవత్...‘ఇది మన పని, దీన్ని మనమే పూర్తి చేయాలి’ అని వ్యాఖ్యానించారు.

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో అయోధ్యలో రామాలయ నిర్మాణం అంశాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రధానంగా ప్రస్తావించారు. పాట్నలో రవిశంకర్ ప్రసాద్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించిన యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలో రామాలయ నిర్మాణం, ట్రిపుల్ తలాక్ అంశాలను లేవనెత్తారు.

First published: May 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...