హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Mohan Bhagwath: ఓటీటీలపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు

Mohan Bhagwath: ఓటీటీలపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు

మోహన్ భగవత్

మోహన్ భగవత్

RSS Chief Mohan Bhagwat: దసరా పండగ వేళ ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్, క్రిప్టో కరెన్సీ, మాదక ద్రవ్యాలను టార్గెట్ చేస్తూ RSS చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీటి వల్ల దేశం నాశనమయిపోతోందని వాపోయారు.

  దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు (Dussehra utsav) ఘనంగా జరుగుతున్నాయి. ప్రజలంతా భక్తి శద్ధలతో అమ్మవారికి ప్రార్థనలు చేస్తున్నారు. విజయ దశమి సందర్భంగా ఆయుధ పూజలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (Rashtriya swayamsevak sangh ) కార్యాలయంలోనూ దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నాగ్‌పూర్‌ (Nagpur)లోని ఆర్ఎస్ఎస్ (RSS) హెడ్ క్వార్టర్స్‌లో విజయదశమి ఉత్సవ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు కేబీ హెడ్గేవర్ (KB Hedgewar), ఎస్ గోల్వాల్కర్ (MS Golwalkar) సమాధులకు నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి ముంబైలోని ఇజ్రాయెల్ కాన్సులేట్ జనరల్ కొబ్బి శోష్నాని కూడా హాజరయ్యారు. ఆయుధ పూజ అనంతరం ప్రసంగించిన మోహన్ భగవత్.. దసరా పండగ వేళ ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్, క్రిప్టో కరెన్సీ, మాదక ద్రవ్యాలను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీటి వల్ల దేశం నాశనమయిపోతోందని వాపోయారు.

  ''మనకు స్వాతంత్ర్యం సిద్ధించిన రోజున స్వేచ్ఛ, సంతోషంతో పాటు చాలా బాధను అనుభవించాం. దేశ విభజన కలిగించిన నొప్పి ఇంకా వెంటాడుతోంది. అది ఒక విచారకరమైన చరిత్ర. విభజనకు దారితీసిన పరిస్థితులు పునరావృతం కాకూడదు. మనం కోల్పోయిన సమగ్రత, ఐక్యతను తిరిగి తీసుకురావాలంటే ఆ చరిత్ర అందరికీ తెలియాలియాలన్నారు. ముఖ్యంగా ఈ యువతరం ఆ రోజు జరిగిన సంఘటనలను గురించి తెలుసుకోవాలి. పోగొట్టుకున్నది తిరిగి రావచ్చు. పోగొట్టుకున్నది తిరిగి పోగొట్టుకోవచ్చు. కానీ మతం, కులం, భాష, ప్రాంతీయతల వంటి సంకుచిత అహాన్ని విడిచిపెట్టాలి. భారత సంస్కృతి, సంప్రదాయాలు, ప్రస్తుత చరిత్రను నాశనం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి. వాటిని తిప్పికొట్టాలి. ''అని మోహన్ భగవత్ అన్నారు.

  ''ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రసారమయ్యే కంటెంట్‌పై నియంత్రణ లేదు. కరోనా తర్వాత చిన్నపిల్లల చేతుల్లోకి కూడా స్మార్ట్ ఫోన్‌లు వచ్చాయి. దేశంలో మాదకద్రవ్యాల వినియోగం పెరిరిగింది. డ్రగ్స్ వ్యాపారం నుంచి వచ్చిన డబ్బును దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు.బిట్ కాయిన్ వంటి విదేశీ కరెన్సీల వల్ల దేశ ఆర్ధిక వ్యవస్ధ గాడి తప్పుతుంది. దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించే విదేశీ చర్యలకు ఈ కరెన్సీ ఉపయోగపడుతోంది. వీటన్నింటికీ అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది.'' అని మోహన్ భగవత్ పేర్కొన్నారు.

  ''తాలిబన్ల చరిత్ర గురించి మనందరికీ తెలుసు. తాలిబన్లకు పాకిస్తాన్, చైనాలు ఇప్పుడు కూడా మద్దతిస్తున్నాయి. తాలిబన్లయినా మారుతారేమో గానీ పాకిస్తాన్ తీరు ఎప్పటికీ మారదు. భారత్ పట్ల చైనా కూడా తమ వైఖరిని మార్చుకుంటోంది. ఈ పరిణామాల కారణంగా మన సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది.'' అని మోహన్ భగవత్ అభిప్రాయపడ్డారు.

  దేశంలో జనాభా విధానం కూడా మారాల్సి ఉందని మోహన్ భగవత్ అభిప్రాయపడ్డారు. వచ్చే 50 ఏళ్ల కాలానికి కొత్త జనాభా విధానాన్ని తీసుకొచ్చి, సమానం స్థాయిలో అమలు చేయాలని  ఆయన అన్నారు. దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులపై మోహన్ భగవత్ చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Dussehra 2021, Maharashtra, Mohan Bhagwat, RSS, Vijayadashami 2021

  ఉత్తమ కథలు