Home /News /national /

RSS CHIEF SAYS WHY LOOK FOR SHIVLING IN EVERY MOSQUE PVN

RSS Chief : ప్రతి మసీదులో శివలింగం ఎందుకు చూస్తున్నాం?

మోహన్ భగవత్(File Photo)

మోహన్ భగవత్(File Photo)

RSS Chief Mohan Bhagwat:ఉత్తరప్రదేశ్(UttarPradesh)లోని వారణాశిలో జ్ఞ‌ానవాపీ మసీదులో శివలింగం అంశం కొంతకాలంగా చర్చలో ఉంది. ఈ నేపథ్యంలో హిందూ ఆలయాలను కూల్చి కట్టిన మసీదుల్లో తవ్వకాలు జరపాలనే డిమాండ్లు రైట్ వింగ్ నుంచి పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్(RSS)చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat)సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఇంకా చదవండి ...
RSS Chief Mohan Bhagwat:ఉత్తరప్రదేశ్(UttarPradesh)లోని వారణాశిలో జ్ఞ‌ానవాపీ మసీదులో శివలింగం అంశం కొంతకాలంగా చర్చలో ఉంది. ఈ నేపథ్యంలో హిందూ ఆలయాలను కూల్చి కట్టిన మసీదుల్లో తవ్వకాలు జరపాలనే డిమాండ్లు రైట్ వింగ్ నుంచి పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్(RSS)చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat)సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తమకు దేవాలయాల కోసం ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం లేదని.. భవిష్యత్తులోనూ హిందూ దేవాలయాల ఉద్యమాల్లో ఆర్‌ఎస్‌ఎస్ పాల్గొనదు అని మోహన్ భగవత్ చెప్పారు. ఆలయాల కోసం ఉద్యమించడం తమ వైఖరికి వ్యతిరేకమే అయినా కొన్ని చారిత్రక కారణాల వల్ల రామ జన్మభూమి ఉద్యమంలో నాడు పాల్గొన్నామని, ఆ పనిని విజయవంతంగా పూర్తి చేశామని భాగవత్ చెప్పుకొచ్చారు. జ్ణానవాపి మసీదు విషయంలో చరిత్రను మార్చలేమని మోహన్ భాగవత్ అన్నారు. పరస్పర అంగీకారం ద్వారా వివాదాన్ని పరిష్కరించుకుందామని ఆయన పిలుపు నిచ్చారు. ఆ మార్గం ఎప్పుడూ బయటకు రాకపోతే ప్రజలు కోర్టును ఆశ్రయిస్తారు.. అది జరిగితే కోర్టు ఏది నిర్ణయించినా అంగీకరించాలి.. మన న్యాయవ్యవస్థ పవిత్రమైంది.. అత్యున్నతమైనదిగా భావించి మనం దాని నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి.. దాని నిర్ణయాలను మనం ప్రశ్నించకూడదుఅని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ వ్యాఖ్యానించారు.

నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మోహన్ భగవత్ మాట్లాడుతూ.."జ్ఞానవాపి వ్యవహారం కొనసాగుతోంది.. మనం చరిత్రను మార్చలేం.. నేటి హిందువులు లేదా నేటి ముస్లింలు దీనిని సృష్టించలేదు.. ఇది అప్పట్లో జరిగింది. ఇస్లాం బయటి నుంచి దేశంపై దాడి చేసిన వ్యక్తుల ద్వారా వచ్చింది. ఈ దాడులలో భారతదేశానికి స్వాతంత్రం కోరుకున్న వారి మనోధైర్యాన్ని అణిచివేసేందుకు దేవస్థానాలను కూల్చివేశారు. జ్ఞానవాపీ అంటే మనకు ప్రత్యేకమైన భక్తి శ్రద్ధలు ఉన్నాయి. ఇది తరతరాల నుంచి వస్తోంది. కానీ ప్రతి మసీదులో శివలింగం కోసం ఎందుకు చూస్తున్నారు? బయటి నుంచి వచ్చిన మతమైనా అది కూడా ఒక పూజా విధానమే. ఆ భక్తి మార్గాన్ని ఎంచుకున్న వారు ముస్లింలు అయ్యారు. అంతేకానీ వారేమీ బయటి వారు కాదు. ఈ విషయాన్ని ముస్లింలు కూడా అర్థం చేసుకోవాలి. హిందువులకు ప్రత్యేక భక్తి ఉన్న ప్రదేశాలపై సమస్యలు తలెత్తాయి. ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులు ఆలోచించరు.. నేటి ముస్లింల పూర్వీకులు కూడా హిందువులే.. వారికి ఎప్పటికీ స్వాతంత్ర్యం లేకుండా ఉంచడానికి, నైతికతను అణచివేయడానికి ఇది జరిగింది.. కాబట్టి హిందువులు వాటిని (మత స్థలాలు) పునరుద్ధరించాలని భావిస్తున్నారు. మనం కొన్ని ప్రదేశాల పట్ల ప్రత్యేక భక్తిని కలిగి ఉన్నాం.. మనం వాటి గురించి మాట్లాడుతాం. కానీ, ప్రతిరోజూ కొత్త వివాదాన్ని బయటకు ఎందుకు తీసుకురావాలి. మనం ఆ వివాదాన్ని ఎందుకు పెంచాలి? మనకు జ్ఞానవాపి పట్ల భక్తి ఉంది.. దాని ప్రకారం ఏదైనా చేస్తున్నాం. అది సరే. అయితే ప్రతి మసీదులో శివలింగాన్ని ఎందుకు చూస్తున్నాం?" అని భగవత్ ప్రశ్నించారు. ఏ విధమైన ఆరాధనకు ఆర్‌ఎస్‌ఎస్ వ్యతిరేకం కాదని, వాటన్నింటినీ పవిత్రంగానే పరిగణిస్తుందని భగవత్ స్పష్టం చేశారు.

ALSO READ Turkey name change:పేరు మార్చుకున్న టర్కీ..ఇకపై ఏమని పిలవాలంటే..

జ్ఞ‌ానవాపీ మసీదు వివాదంపై వారణాసి జిల్లా కోర్టులో విచారణ జరుగుతోన్న విషయం తెలిసిందే. మసీదులో హిందూ దేవతల విగ్రహాలున్నాయని, వాటికి నిత్యపూజలు నిర్వహించేలా అనుమతించాలని కోరుతూ ఐదుగురు మహిళలు కోర్టుకు వెళ్లడంతో వివాదం మొదలైంది. మసీదు ప్రాంగణంలో వీడియో సర్వేకు కోర్టు ఆదేశించడం, వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. దీనిని జిల్లా కోర్టుకు బదిలీ చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించడంతో విచారణ జరుగుతోంది. తదుపరి విచారణ జులై 4న జరగనుంది
Published by:Venkaiah Naidu
First published:

Tags: RSS, Uttar pradesh, Varanasi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు