హిందుత్వ సిద్ధాంతకర్త, స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్ (Veer Savarkar) పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్. (Mohan Bhagwat) మంగళవారం ‘వీర్ సావర్కర్: ద మ్యాన్ హూ కుడ్ హ్యావ్ ప్రివెంటెడ్ పార్టిషన్’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న భగవత్.. వీర్ సావర్కర్(Veer Savarkar) ఏ వర్గంపైనా వివక్ష చూపలేదన్నారు. సావర్కర్ హిందుత్వ సిద్ధాంతం.. సంస్కృతి, దేవుడిని ఆరాధించే పద్ధతి ఆధారంగా ప్రజల మధ్య వ్యత్యాసాలు, భేదభావాలు చూపలేదన్నారు.
"మనం ఒకే మాతృభూమి పుత్రులమని.. మనమందరం సోదరులమని.. విభిన్న ఆరాధన పద్ధతులు మన దేశ సంప్రదాయమని సావర్కర్ చెప్పేవారు. మనం దేశం కోసం కలిసి పోరాడుతున్నామని ఆయన భావించేవారు. అలాంటప్పుడు మనం ఒకరి సంస్కృతితో ఎందుకు విభేదిస్తాం? అని సావర్కర్ సర్కార్ అనేవారు” అని భగవత్(Mohan Bhagwat) వ్యాఖ్యానించారు. సావర్కర్ ముస్లింలకు శత్రువు కాదని భగవత్ నొక్కిచెప్పారు. తాను ఉర్దూలో అనేక గజల్స్ రాశారని తెలిపారు.
Telangana: ఆ కారు బండి సంజయ్ మిత్రుడిదే.. బీజేపీకి టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కౌంటర్
"భారతీయ సమాజంలో హిందుత్వం, ఐక్యత గురించి చాలా మంది మాట్లాడారు. నిజానికి సావర్కర్ దాని గురించి ఎప్పుడో తన గొంతెత్తారు. ప్రతి ఒక్కరూ సావర్కర్ లాగా గట్టిగా మాట్లాడి ఉంటే దేశ విభజన జరిగి ఉండేది కాదని ఇప్పుడు అనిపిస్తోంది. విభజన తర్వాత పాకిస్తాన్‌కు వలస వెళ్లిన ముస్లింలకు ఆ దేశంలో ఎలాంటి గౌరవం లభించడం లేదు. ఎందుకంటే వారు భారతదేశానికి చెందినవారు. వారి మాతృభూమిని ఎవరూ మార్చలేరు. భారతీయులందరికీ ఒకే పూర్వీకులు ఉన్నారు. మన ఆరాధనా విధానం మాత్రమే భిన్నంగా ఉంది. మనమందరం సనాతన ధర్మం ఉదార సంస్కృతికి గర్వించాలి. ఆ వారసత్వమే మమ్మల్ని ముందుకు తీసుకువెళుతుంది. భారతదేశంలో ఉన్న ఉదార సనాతన ధర్మం సంస్కృతి వల్లే మనమందరం ఇక్కడ కలిసి శాంతియుత సహజీవనం చేస్తున్నాం" అని భగవత్ అన్నారు.
సావర్కర్ హిందుత్వ అయినా లేదా వివేకానంద హిందుత్వ అయినా అన్నీ ఒకే సాంస్కృతిక జాతీయవాదం గురించి చెబుతాయని చెప్పారు. ఒకే భావన ప్రాతిపదికన ప్రజలు విభిన్నంగా ఉండకూడదని ఈ హిందూ ధర్మాలు సూచిస్తాయని ఆర్ఎస్ఎస్ చీఫ్ పేర్కొన్నారు.
ఇదే కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఇరవయ్యవ శతాబ్దంలో పుట్టిన వీర్ సావర్కర్ ఓ నిఖార్సైన జాతీయవాది అని, భారతదేశ తొలి సైనిక వ్యూహకర్త అని.. నేషనల్ ఐకాన్ అని ప్రశంసించారు. అతను భారతదేశ చరిత్రలో గౌరవించదగిన ప్రముఖ వ్యక్తి అని.. ఆయన ఎప్పటికీ అలాగే ఉంటారని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. సావర్కర్ గురించి భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు కానీ అతడిని తక్కువగా చూడడం సరైనది కాదన్నారు. మార్క్సిస్ట్, లెనినిస్ట్ సిద్ధాంతాలను అనుసరించే వ్యక్తులు సావర్కర్‌ను ఫాసిస్ట్ అని నిందించడం హర్షించదగినది కాదని అన్నారు.
Manchu Vishnu: మంచు విష్ణు అలాంటి రూల్ పెట్టబోతున్నారా ? ప్రకాశ్ రాజ్ మాటలకు అర్థమేంటి ?
"జైలు నుంచి విడుదల కావాలని సావర్కర్ అనేక క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేసినట్లు అబద్ధాలు ప్రచారం చేశారు. నిజానికి ఆ క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేయమని మహాత్మాగాంధీ సావర్కర్‌ను కోరారు. ఇతర దేశాలతో సంబంధాలు పెట్టుకునే ముందు భారత్ కి ప్రయోజనాలు ఉంటాయా లేదా అనే అంశాలపై సావర్కర్ నిక్కచ్చిగా మాట్లాడే వారు. సావర్కర్ 20వ శతాబ్దంలో భారతదేశపు తొలి సైనిక వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు. అతను దేశానికి బలమైన రక్షణ, దౌత్య సిద్ధాంతాన్ని అందించారు" అని రాజ్‌నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mohan Bhagwat, RSS